‘స్లో పాయిజన్’ టేస్ట్… జగన్ కే ఎరుక..!

ysrcp mla mustafa to join tdp‘స్లో పాయిజన్’ విపరీతమైన బాధను మిగుల్చుతుంది. ప్రస్తుతం ఇలాంటి అనుభూతినే జగన్ అనుభవిస్తున్నారని చెప్పక తప్పని పరిస్థితి నెలకొంది. వైసీపీని వీడుతున్న ఎమ్మెల్యేల సంఖ్య దాదాపుగా ఓ 30 నుండి 40 మధ్యలో ఉంటుందని గత కొన్నాళ్ళుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, అంతా ఒక్కసారే వెళ్ళిపోతే ఆ బాధ ఆ ఒకటి, రెండు రోజులు మాత్రమే ఉంటుంది. కానీ, వైసీపీ ఎమ్మెల్యేల చేరికలో టిడిపి ఓ స్పష్టమైన స్ట్రాటజీ కనపడుతోంది.

రోజుకో ఎమ్మెల్యే పేరు తెరపైకి వస్తుండడం… ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే ఒకటి, రెండు రోజుల తర్వాత ప్రకటన చేయడం, అలాగే ముహూర్తానికి మరో ప్రకటన… ఇలా ఒక వారం, పది రోజుల పాటు ఒక్కో ఎమ్మెల్యే మీడియా వర్గాలలో హల్చల్ చేస్తూ వైసీపీ అధినేతకు తీవ్ర మనోవేదనను మిగులుస్తున్నారు. ఇలా ఒకరి ఉదంతం ముగిసే లోపున ఒకరిద్దరు పేర్లు మళ్ళీ తెరపైకి రావడం… ఇలా “సైకిల్” నిరంతరంగా తిరుగుతూనే ఉంటోంది.

ADVERTISEMENT

తాజాగా ఈ జాబితాలోకి వచ్చిన పేరు గుంటూరు టౌన్ కు చెందిన ఎమ్మెల్యే ముస్తఫా టిడిపిని వీడబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఐటిసి హోటల్ ను ప్రారంభించడానికి విచ్చేసిన ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన ముస్తఫా, వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారని, మరో ఒకటి, రెండు రోజుల్లో ప్రకటన రావచ్చని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏ ‘జంపింగ్’ల నైతే జగన్ ప్రోత్సహించి, తన రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నారో, ప్రస్తుతం అదే ‘జంపింగ్’లతో తల పట్టుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories