కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో నిధులు మళ్లించి అప్పటి వైఎస్ ప్రభుత్వం నుంచి భారీగా లబ్ధి పొందిన ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి, ఆయనకు సహకరించిన మరో రెండు సంస్థలకు చెందిన రూ.117 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రభుత్వం లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 8,844 ఎకరాలు ఇచ్చింది.
ఇందు టెక్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు శంషాబాద్ వద్ద 250 ఎకరాలతోపాటు, ఇందూ గ్రూప్‌నకు వివిధ హౌసింగ్ ప్రాజెక్టులు ఇచ్చింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక వార్త షికారు చేస్తుంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది.
నిన్న నగిరి ఎమ్మెల్యే రోజా ఆయనకు చింతపర్తిలో బొట్టు పెట్టి, హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఆమె ఐరన్ లెగ్ వల్లే సాయంత్రానికి జగన్ కు ఈ బాడ్ న్యూస్ వచ్చిందని ఆ వార్త సారాంశం. ఏది ఏమైనా ప్రతిదీ ఇలా ఆమెకు ఆపాదించడం తప్పే!



