‘‘కొందరు నన్ను వచ్చే ఎన్నికల్లో చంపేద్దామనే ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇదే అంశంపై ఎవరో ముగ్గురు మాట్లాడుకున్న ఆడియోలు నా వద్దకు వచ్చాయి. నన్ను చంపేస్తే.. అందుకు కారకులు ప్రతిపక్షమని, అధికార పక్షమని ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటారని, ఆపై జనమూ మరిచిపోతారని వాళ్లనుకున్నారు,” అని నిన్నజనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించి సంచలన సృష్టించారు.
[m9ad]
అయితే దీనిపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కు ఏమైనా జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు వేరే పార్టీ అభిమానులు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు. ఈ విషయం మాట్లాడుతున్న సమయంలో ఒక సారి పవన్ కళ్యాణ్ ఆ ఆడియో టేప్ లో ఉన్నవారెవరో తెలీదని, మరోసారి వారు ఎవరో తెలుసని అన్నారు.
దీనిబట్టి ఇది అభిమానులను ఉత్తేజం చేసే ప్రయత్నమే అని వారు కొట్టి పారేస్తున్నారు. గతంలో అత్తారింటికి దారేది సినిమా పైరసీకి గురయినప్పుడు, ఇటీవలే శ్రీ రెడ్డి వ్యవహారమప్పుడు పవన్ ఇలాగే వ్యాఖ్యలు చేసి, వారెవరో తెలుసు వారిని వదిలే ప్రసక్తి లేదు అని చెప్పి తరువాత సైలెంట్ అయిపోయిన విషయాన్నీ వారు ప్రస్తావిస్తున్నారు.



