వీర్రాజుకు మాత్రమే వినపడేలా చంద్రబాబు గవర్నర్ ని ఎప్పుడు పొగిడారో మరి

Somu Veerraju BJP-రాజ్యంగ పదవి అన్న ధ్యాస మర్చిపోయి గవర్నర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవహేళన చేయడం ఎంతవరకు సబబు? నరసింహన్‌పై చంద్రబాబు యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారు? దీని వెనుక కారణాలేంటి? ఏమైనా భారీ గ్రౌండ్‌ ప్రిపరేషన్‌ చేస్తున్నారా?’’ అని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.

ADVERTISEMENT

“నిన్నటిదాకా గవర్నర్‌ను ప్రశంసలతో ముంచెత్తిన సీఎం.. ఒక్కసారే యూటర్న్‌ తీసుకోవడానికి వెనుక కారణాలేంటి? ఏమైనా గ్రౌండ్‌ ప్రిపరేషన్‌ చేస్తున్నారా! దీని గురించి ప్రజలు ఆలోచించాలి, చర్చించాలి’’ అని వీర్రాజు వ్యాఖ్యానించారు. అయితే కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న గవర్నర్ ను సోము వీర్రాజు సమర్ధించడం పెద్ద వింత ఏమి కాదుగానీ ఆయనకు సీఎం ఎప్పుడు గవర్నర్ ను పొగిడినట్టు అనిపించిందో మరి.

టీడీపీ మొదటినుండీ కూడా గవర్నర్ ను మార్చాలని కేంద్రం పై ఒత్తిడి చేసింది. అయితే కేంద్రంతో పాటు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సపోర్టుతో ఆయన కాంగ్రెస్ నియమించిన గవర్నర్ ఐన పదవిలో కొనసాగగలిగారు. ఇప్పటికే 11 ఏళ్ళ పాటు ఆ పదవిలో ఉన్నారు. అంటే గవర్నర్ కు కేంద్రం మద్దత్తు ఉన్నట్టేగా!

ADVERTISEMENT
Latest Stories