పంచాయితీ సెంటర్ లో… రాజధాని సైడ్ లో..!

speaker tammineni sitaram words became viralఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సపరేట్ పంచాయితీ కావాలని అడిగితే జంగాలవలసను ఇచ్చాము, ఎక్కువ జనాభాతో పాటు ‘సెంట్రల్లీ లోకేటెడ్’ అంటూ తమ్మినేని చేతులు తిప్పుతూ దాని ప్రాముఖ్యతను వివరించారు.

పంచాయితీ పెట్టినటువంటి గ్రామం మధ్యలో ఉంది, కాబట్టి అది అనువుగా ఉంటుందనే ఆలోచనతో చేసాం, దానికేముందయ్యా, మీరందరూ మాకు సమానమే అంటూ తదితర గ్రామ ప్రాంతాల పేర్లన్నీ చెప్పుకొచ్చారు. అయితే ఇదే తమ్మినేని సీతారామ్ రాజధానిగా అమరావతి విషయంలో ఎలా స్పందించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ADVERTISEMENT

దీంతో సదరు వీడియోను పోస్ట్ చేస్తూ… పంచాయితీ అయితే సెంటర్ లో ఉండాలా? రాజధాని మాత్రం ఓ సైడ్ లో ఉండాలా? అంటూ తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. పంచాయితీకి ఇచ్చిన విలువ రాజధానికి ఇచ్చి ఉంటే, గడిచిన మూడేళ్ళ పాటు ఏపీకి రాజధాని లేకుండా ఉండేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

ఆ మాటకొస్తే గడిచిన మూడేళ్లే కాదు, రాబోయే రెండేళ్లకు కూడా ఏపీ రాజధాని ఏమిటి? అన్నది ఓ ప్రశ్నగానే మిగిల్చిన ఘనత వైసీపీ సర్కార్ ది. నాడు, నేడు కూడా రాజధాని విషయంలో చంద్రబాబు చెప్తోంది కూడా అదే కదా… రాష్ట్రంలో సెంటర్ గా అటు విశాఖకు, ఇటు అనంతపూర్ కు నడుమ అమరావతి ఉంది, అందరికీ అనువుగా ఉంటుందని!

ADVERTISEMENT
Latest Stories