అర్జున్… శృతి… మధ్య నాడు జరిగింది ఇదే..!

Sruthi Hariharan Names Arjun Sarja In #MeToo Account‘మీటూ’ అంటూ మహిళామణులంతా తమకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియా వేదికగా గొంతెత్తి చెప్తుండగా… ఇందులోకి ప్రముఖుల పేర్లు రావడం కలకలం రేపింది. అందులో ముఖ్యంగా యాక్షన్ కింగ్ అర్జున్ పేరును హీరోయిన్ శృతి హరిహరన్ తెరపైకి తీసుకురావడం తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో సంచలనంగా మారింది. అయితే శృతి ఆరోపణలలో వాస్తవం ఎంత ఉందో గానీ, నాడు జరిగిన ఉదంతాన్ని దర్శకుడు అరుణ్ వైద్యనాథన్ ప్రస్తావించారు.

ADVERTISEMENT

[m9ad]

‘అర్జున్, శృతిలు నాకు మంచి స్నేహితులు. వీరిద్దరిపై చిత్రీకరించిన సీన్ ను నేను చాలా రొమాంటిక్ గా రాసుకున్నాను. కానీ నాకు టీనేజ్ లో ఉన్న కూతురు ఉంది, ఇలాంటి సీన్స్ లో తాను చేయలేను అంటే, అర్జున్ సూచన మేరకు ఆ శృంగారాన్ని తగ్గించాను. శృతి చేస్తోన్న ఆరోపణలు తనను షాక్ కు గురి చేస్తున్నాయి, దీని గురించి ఇంకా తననేమీ అడగవద్దంటూ” సోషల్ మీడియా వేదికగా తన శైలిలో ‘విస్మయం’ దర్శకుడు వివరణ ఇచ్చుకున్నారు.

ఇక తనపై వచ్చిన ఆరోపణలను అర్జున్ సైతం ఖండించారు. శృతితో తాను ఒకే ఒక్క సినిమా నటించానని, ఆ సినిమా షూటింగ్ లో తాము ఒక్కసారి కూడా ఒంటరిగా కలుసుకోలేదని, ఇలాంటి ఆరోపణల వలన ‘మీటూ’ ఉద్యమం నీరుగారిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేసారు. తన కెరీర్ లో తాను ఎన్నడూ హీరోయిన్లను వేధించలేదని, ఇవన్నీ కేవలం నిరాధారమైన ఆరోపణలుగా కొట్టిపారేసారు. తాజా పరిణామాలతో శృతి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories