రాజమౌళి అవార్డు… రాష్ట్రపతి భవన్ చప్పట్లు…!

ss raja mouli recieves award from president pranabh mukherjeeరాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డుల మలి విడత ప్రధానోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ‘దర్శకధీరుడు’ రాజమౌళి ‘పద్మశ్రీ’ అవార్డును అందుకుంటున్న సమయంలో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, హీరో రజనీకాంత్, రామోజీరావు సహా ఆడిటోరియంలోని ప్రతి ఒక్కరూ చప్పట్లతో అభినందించారు. రాష్ట్రపతికి వినమ్రంగా నమస్కరించిన రాజమౌళి తన అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును అందుకోవడం వీక్షిస్తున్న రమా రాజమౌళి సంతోషంలో మునిగి తేలారు.

పద్మ అవార్డు గ్రహీతల్లో రామోజీ ఫిలిం సిటీ అధినేత రామోజీరావు, సూపర్ స్టార్ రజనీకాంత్ లు పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకున్నారు. రజనీకాంత్ అవార్డును అందుకుంటున్న వేళ కూడా ఆడిటోరియం అంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది. వీరితో పాటు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, గాయకుడు ఉదిత్ నారాయణ్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులు పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories