అక్టోబర్ లో మళ్ళీ రానున్న సుధీర్ – నభా నటేష్!

Sudheer Babu - Nabha Natesh -Veera Bhoga Vasantha Rayaluప్రస్తుతం “నన్ను దోచుకుందువటే” సినిమా ద్వారా ధియేటర్లలో సందడి చేస్తోన్న సుధీర్ బాబు – నభా నటేష్ జంట, అక్టోబర్ లో కూడా అలరించడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సారి జంటగా కాదు, ఇద్దరూ విడివిడిగా సినీ ప్రేక్షకులను అలరించేందుకు సన్నద్ధం అవుతున్నారు. నారా రోహిత్ తో పాటుగా సుధీర్ బాబు కూడా ఓ కీలక పాత్రలో నటించిన “వీరభోగవసంతరాయలు” సినిమా అక్టోబర్ 5వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.

అంటే షార్ట్ గ్యాప్ లోనే మళ్ళీ సుధీర్ బాబు సిల్వర్ స్క్రీన్ పై మరో పాత్రలో ప్రత్యక్షం అవ్వబోతున్నారన్న మాట. అలాగే నభా నటేష్ నటించిన మొదటి సినిమా “అదుగో” కూడా అక్టోబర్ లో విడుదలయ్యేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. ఈ సినిమా నిరంతర వాయిదాలు వేసుకోవడంతో, “నన్ను దోచుకుందువటే” సినిమాతో పరిచయం అయ్యి మంచి మార్కులు వేసుకుంది. విడివిడిగా అయినా…. వెరీ షార్ట్ గ్యాప్ లోనే “నన్ను దోచుకుందువటే” జంట మళ్ళీ ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి రెడీ అవుతోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories