పుకార్లు బాబూ… నమ్మొద్దన్న టాప్ డైరెక్టర్..!

Sukumar said about Darshakuduఈ నెల 30వ తేదీన విడుదల కాబోతున్న “రంగస్థలం” తర్వాత సుకుమార్ ఎవరితో సినిమా చేయబోతున్నారు? అనేది ట్రేడ్ వర్గాలలో అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ జాబితాలో పేర్లు చాలామందే ఉన్నప్పటికీ, తాజాగా మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపించడం హైలైట్ అయ్యింది. క్రియేటివిటీని పతాక స్థాయిలో చూపించే సుకుమార్ కు మెగాస్టార్ నిజంగా అవకాశం ఇచ్చారా? అన్నది వైరల్ అయిన ప్రశ్న.

ADVERTISEMENT

దీనికి సమాధానం సుకుమార్ నుండి తాజాగా లభించింది. అసలు తమ మధ్య అలాంటి చర్చలు కూడా జరగలేదని, ఇవన్నీ కేవలం ఒట్టి పుకార్లేనని సుకుమార్ తేల్చేసారు. దీంతో చిరు – సుక్కూల కాంబో కేవలం ఒక పుకారుగా మిగిలిపోయింది. అయితే మెగాస్టార్ ను డైరెక్ట్ చేయడం అనేది తన కల అని, అలాంటి అవకాశం లభిస్తే మాత్రం వదులుకోనని సుకుమార్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT
Latest Stories