భీమనేని శ్రీనివాసరావు – అల్లరి నరేశ్ కాంబినేషన్లో గతంలో తమిళ రీమేక్ గా వచ్చిన ‘సుడిగాడు’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత చేసిన సినిమాలేవీ అల్లరి నరేశ్ కి ఆ స్థాయి సక్సెస్ ను అందించలేదు. ఈ నేపథ్యంలోనే తమిళంలో ఒరిజినల్ వెర్షన్ లో ఈ సినిమా సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. దాంతో తెలుగులోను సీక్వెల్ చేయడానికి భీమనేని శ్రీనివాసరావు రంగంలోకి దిగాడు.
తాజా కథ ప్రకారం అల్లరి నరేశ్ తో పాటు సునీల్ ను కూడా తీసుకోనున్నట్టు చెబుతున్నారు. అల్లరి నరేశ్ మాదిరిగానే కొంతకాలంగా సునీల్ కూడా సక్సెస్ కోసం వెయిట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి సరసన స్టార్ హీరోయిన్స్ వుంటే బాగుంటుందనే ఉద్దేశంతో, రకుల్, లావణ్య త్రిపాఠిని సంప్రదిస్తున్నారట. వాళ్లు కుదరదంటే అప్పుడు ఇతర హీరోయిన్స్ గురించిన ఆలోచన చేస్తారనే టాక్ వినిపిస్తోంది.
ADVERTISEMENT
ADVERTISEMENT



