నోట్ల రద్దు ఆషామాషీ వ్యవహారమా… సుప్రీం సీరియస్..!

Supreme Court Serious on demonetizationపెద్ద నోట్లు రద్దయ్యి 32 రోజులు గడిచినా ప్రజల కష్టాలలో ఏ మాత్రం వ్యత్యాసం లేకపోగా, రోజుకు రోజుకు కరెన్సీ కష్టాలు మరింతగా పెచ్చుమీరుతున్నాయి. తాజాగా సహనం కోల్పోయి బ్యాంకులపై దాడులు జరుగుతున్న సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అయితే… ఒక వారం, పది రోజుల్లో మొత్తం సెట్ అయిపోతుందని చెప్పిన కేంద్ర సర్కార్ పై సుప్రీంకోర్టు తీవ్రంగానే స్పందించింది. “అసలు ఈ నిర్ణయం తీసుకునే ముందు అసలు కేంద్రం వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా? లేక ఆషామాషీగా నోట్ల రద్దును ప్రకటించారా? అని ప్రశ్నించింది.

ADVERTISEMENT

నోట్ల రద్దుపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన వేళ, అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదన విన్న అనంతరం, “500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన వేళ, మీరనుకున్నంత మేరకు కొత్త కరెన్సీని వ్యవస్థలోకి ప్రవేశపెట్టారా? అసలెంత కొత్త కరెన్సీ కావాలని అంచనా వేశారు? మీ వద్ద ఏదైనా ప్లాన్ వుందా? 10 లక్షల కోట్లు బ్యాంకుల్లోకి వస్తాయని భావిస్తే, అంత మొత్తం కొత్త కరెన్సీని వ్యవస్థలోకి ప్రవేశపెట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.

చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, న్యాయమూర్తులు ఏఎం ఖాన్ విల్కార్, డీ చంద్రచూడ్ ల ధర్మాసనం కేసును విచారించింది. కాగా, డిసెంబర్ 31లోగా మరో రెండు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ కావచ్చని అంచనా వేస్తున్నట్టు అటార్నీ జనరల్ తెలిపారు. కేసు తదుపరి విచారణను వాయిదా వేస్తూ… తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మోడీ సర్కార్ ను ధర్మాసనం ఆదేశించింది.

ADVERTISEMENT
Latest Stories