
ఓ పెద్ద హీరో, పెద్ద దర్శకుడు కాంబినేషన్‌లో వందల కోట్ల బడ్జెట్‌తో తీసిన పాన్ ఇండియా మూవీపై ఏవిదంగా చాలా భారీ అంచనాలు ఉంటాయో, కేసీఆర్‌ని ఓడగొట్టి ఫామ్‌హౌస్‌లో పడుకోబెట్టి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డిపై కూడా తెలంగాణ ప్రజలలో అటువంటి అంచనాలే ఉండేవి.
కనుక సిఎం రేవంత్ రెడ్డి మొదట్లో చాలా దూకుడుగా వ్యవహరించి ప్రజలను ఆకట్టుకోగలిగారు. కానీ క్రమంగా సమస్యలు, వివాదాలలో కూరుకుపోతున్నారు.
Also Read – ఏ.ఆర్. రెహమాన్‌కు 2 కోట్ల జరిమానా!
ప్రభుత్వ ఆదాయానికి, అవసరాలకు ఎక్కడా పొంతన లేకపోవడంతో కంచ గచ్చిబౌలి వద్ద హైదరాబాద్ యూనివర్సిటీ చుట్టూ ఉన్న 400 ఎకరాలు వేలం వేసి నిధులు సమకూర్చుకోవాలనుకున్నారు.
కానీ ఆ భూములలో పచ్చటి చెట్లు, వాటిలో చిన్న చిన్న జంతువులు, పక్షులు ఉన్నాయని, ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అటవీ ప్రాంతంలో చెట్లు నరికివేసి ప్రకృతికి, పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నారంటూ సుప్రీంకోర్టులో కేసులు పడ్డాయి.
Also Read – మిల్వాకీ లో ATA ఉమెన్స్ డే మరియు ఉగాది వేడుకలు
వాటిపై జస్టిస్ గవాయ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు విచారణ చేపట్టినప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్లు నరికే విషయంలో సుప్రీంకోర్టు పాత తీర్పులని, నియమ నిబందనలు ఏవీ పట్టించుకోకుండా చెట్లు ఎలా నరుకుతున్నారని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
కానీ ప్రభుత్వం తరపు వాదించిన అభిషేక్ మను సింఘ్వీ ఎటువంటి ఉల్లంఘనలు జరుగలేదని వాదించినందున ఒకవేళ చెట్లు నరికిన్నట్లు రుజువైతే తెలంగాణ సీఎస్‌తో సహా సంబంధిత అధికారులు అందరూ జైలుకి వెళ్ళవలసి వస్తుందని జస్టిస్ గవాయ్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ కేసు తదుపరి విచారణ మే 15 కి వాయిదా వేశారు.
Also Read – కేసీఆర్ వైఖరిలో అనూహ్య మార్పులు.. ఏమవుతుందో?
కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ ప్రభుత్వానికి యాజమాన్య హక్కులు, అమ్ముకునే అధికారమూ లేదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. కానీ ఉందని చెప్పి ఆ భూములను ఐసీఐసీఐ బ్యాంకులో తనఖా పెట్టి తెలంగాణ ప్రభుత్వం రూ.10,000 కోట్లు అప్పు తెచ్చుకుంది.
ఆ భూములపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది. పైగా ఆ భూములు ప్రభుత్వ భూములని నిరూపించుకోలేకపోతే వాటిని బ్యాంకులో తనఖా పెట్టడం, అప్పు చేసి ఆ సొమ్ముని ఖర్చు చేయడం ఆర్ధిక నేరాలవుతాయి.
ఈ భూముల అమ్మకానికి ఓ బ్రోకరేజ్ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం రూ.170 కోట్లు కమీషన్ చెల్లించడం మరో కుంభకోణంగా కాంగ్రెస్ పీకకు చుట్టుకునేలా ఉంది.
కనుక కంచ గచ్చిబౌలి భూముల వేలం గేమ్ చేంజర్ అవుతుందనుకుంటే గేమ్ చేంజర్ సినిమాలాగే అట్టర్ ఫ్లాప్ అవడమే కాకుండా ఆ కంచలో కాంగ్రెస్ ప్రభుత్వం చిక్కుకుపోయినట్లే కనిపిస్తోంది.