హైకోర్టు తరలింపుపై సస్పెన్స్

Suspense To Be Over in High Court Division?అమరావతి పరిధిలో తాత్కాలిక భవనంలో ఏపీ హైకోర్టు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాసిన నేపథ్యంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ ఆధ్వర్యంలో న్యాయమూర్తులందరూ బుధవారం సమావేశమయ్యారు.

ADVERTISEMENT

అయితే వారు దానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. తొలుత తాత్కాలిక భవనాల పరిశీలనకు కమిటీని ఏర్పాటు చేయాలని, కమిటీ వెళ్లి వచ్చాక మళ్లీ సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించడానికి అంగీకరించినట్లు సమాచారం. తాత్కాలిక భవనమైనా ఏర్పాట్లు పూర్తిస్థాయిలో ఉండాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమైంది.

ఒకవేళ అక్కడి వసతులు కమిటీకి నచ్చకపోతే ఈ అంశం పక్కన పెట్టొచ్చు. దీనితో ఆ కమిటీ ఏర్పాటు, వారి రిపోర్ట్ గురించి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు తెలంగాణా వారు. అమరావతిలో వసతి నచ్చకపోతే తగిన వసతి హైదరాబాద్ లో చూపిస్తాం ఏపీ హై కోర్టుకి అనే ప్రతిపాదన కూడా చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం.

ADVERTISEMENT
Latest Stories