గత ఎన్నికలలో క్రిస్టియన్ రంగు వల్ల నష్టపోయాం అని వైకాపా భావిస్తుంది. అందులో భాగంగానే జగన్ పుష్కరాల యాత్ర, దేవాలయాల యాత్రతో పాటు ఎంతో మంది స్వామీజీలకు పాదాభివందనాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఏకంగా స్వామి స్వరూపానందను పార్టీలోకి తీసుకుని రానున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.
విశాఖ కేంద్రం గా రాజకీయాలు చేసే టి. సుబ్బరామిరెడ్డి మద్దతుతో స్వరూపానంద బాగా పాపులర్ అయ్యారు. తరచు రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ టీడీపీని ఇరుకునపెడుతూ జగన్ కు మద్దత్తు ఇస్తూ ఉంటారు ఈ సాములోరు. వైఎస్ జగన్ తన మీద ఉన్న క్రిష్టియన్ అనే ముద్ర తొలగించుకోవడానికి స్వరూపానంద ఆధ్వర్యంలో అనేక పూజలు, యజ్ఞాలు చేస్తుంటారు కూడా.
ఇప్పుడు ఆయనకు ఏకంగా విశాఖపట్నం ఎంపీ టిక్కెట్ ఇస్తే ఎలా ఉంటాదని జగన్ ఆలోచన చేస్తున్నారట. గత ఎన్నికల్లో వైజాగ్ నుంచి జగన్ తల్లి విజయమ్మ పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఈ సీట్ స్వరూపానంద కి కేటాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని వైకాపా ఆలోచన అట.
పైగా తమ పార్టీపై ఉన్న క్రిస్టియన్ మార్కు పోయి హిందువులను ఆకట్టుకోవచ్చని జగన్ వ్యూహమట. స్వరూపానంద రాజకీయాల్లోకి వస్తే గనుక అది పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమి కాదు. ఆయన ఆధ్యాత్మిక విషయాల కంటే రాజకీయ విషయాలపైనే ఎక్కువ ఆసక్తి చుబిస్తూ ఉంటారు.



