స్వరూపానందేంద్ర స్వామీజీ… కావాలంటే జగన్ పార్టీలో చేరు..!

Swarupananda swamy comments on TDPవిశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిపై ‘బ్రాహ్మణ సంఘాలు’ అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో స్వరూపానందేంద్ర కుమ్మక్కయ్యారని ఘాటు విమర్శలు చేశాయి. ఈ వివాదం వివరాల్లోకి వెళితే… ఇటీవల విజయవాడ కేంద్రంగా ‘విప్రోత్సవం’ పేరిట బ్రాహ్మణ సంఘాల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హాజరైన సందర్భంగా స్వరూపానందేంద్ర… టీడీపీ సర్కారు మరియు బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

“కార్పొరేషన్ ద్వారా మంజూరవుతున్న రుణాలన్నీ ఒక్క టీడీపీకి చెందిన వారికే అందుతున్నాయని” తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై బ్రాహ్మణ చైతన్య వేదిక కో- కన్వీనర్ సిరిపురపు శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ తో కుమ్మక్కైన స్వరూపానందేంద్ర… పేద బ్రాహ్మణుల కోసం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ పై తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు.

ADVERTISEMENT

స్వరూపానందేంద్ర చెబితే సీఎం చంద్రబాబు కార్పొరేషన్ ను ఏర్పాటు చేయలేదని, రాజకీయాలు చేసే ఉద్దేశం ఉంటే… స్వామిజీ ముసుగు తీసివేసి వైసీపీలో చేరి బహిరంగంగా మాట్లాడాలని స్వరూపానందేంద్రకు సూచించారు. ఇటీవల కాలంలో కుల రాజకీయాలు పెచ్చు మీరుతున్న నేపధ్యంలో, స్వామీజీ చేసిన విమర్శలను ‘బ్రాహ్మణ సంఘం’ వారు తిప్పికొట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం.

ADVERTISEMENT
Latest Stories