కొత్త బంగారు లోకం’ పిల్ల మరో కొత్త లోకం!

Swetha Basu, Swetha Basu Affair, Swetha Basu Love Affair, Swetha Basu Illegal Affair, Swetha Basu Rohit Affair, Swetha Basu Prasad Love Affair, Swetha Basu Prasad Rohit Mittal Love Affairఎప్పుడూ ఏదొక రూపేణా వార్తల్లో నిలవడం టాలీవుడ్ హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ కు పరిపాటిగా మారిపోయింది. శ్రీకాంత్ అడ్డాల ‘కొత్త బంగారు లోకం’ సినిమా ద్వారా ‘ఏ…క్కడ…’ అంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్వేతా, తదనంతరం ‘సెక్స్ రాకెట్’లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ళు జైలులో కూడా ఉండి వచ్చిన ఈ ముద్దుగుమ్మ, ఈ విషయంలో తనను బలిపశువుని చేసారని ఆరోపణలు చేసింది.

అయితే ఆ తర్వాత చెదురుమదురుగా చిన్న సినిమాలలో ఐటెం సాంగ్స్ చేసుకుంటూ… మరియు అవార్డు వేడుకలపై నృత్య ప్రదర్శనలు ఇస్తూ కాలం గడుపుతుండగా, తాజాగా ఓ బాలీవుడ్ దర్శకుడుతో డేటింగ్ లో ఉందన్న వార్తలు గుప్పుమన్నాయి. బాలీవుడ్ చిన్న సినిమాలను నిర్మిస్తూ నిర్మాత, దర్శకుడిగా కొనసాగుతున్న రోహిత్ మిట్టల్ తో ఈ ‘కొత్త బంగారు లోకం’ బ్యూటీ మరో కొత్త లోకాన్ని చూస్తోందని సోషల్ మీడియాలో గుప్పుమంది.

ADVERTISEMENT

శ్వేతా, రోహిత్ లు సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వద్ద శ్వేతా బసు స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తోందని, ఈ క్రమంలోనే శ్వేతాకు, రోహిత్ కు పరిచయం ఏర్పడి, అది డేటింగ్ దాకా తీసుకెళ్లిందనేది ఈ వార్తల సారాంశం. ఈ రకంగా మళ్ళీ కావాల్సినంత ప్రచారాన్ని బాలీవుడ్ వర్గాల్లో కూడా దక్కించుకుంటోంది శ్వేతా.

ADVERTISEMENT
Latest Stories