పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలోకి రావడం ఖాయం అయిపోయింది. బాలీవుడ్ లో హిట్టయిన పింక్ రీమేక్ లో ఆయన నటించబోతున్నారని వార్తలు వచ్చాయి. మొన్నే ఆ సినిమా ముహూర్తం కూడా చేసుకుంది. థమన్ సారథ్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయని దిల్ రాజు ప్రకటించారు. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
కథాప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఇప్పటికే నివేత థామస్, అంజలి కంఫర్మ్ అయినట్టు చెబుతున్నారు. హిందీలో తాప్సి చేసిన పాత్ర కోసం ఆమెనే తీసుకోవాలని దిల్ రాజు అనుకున్నారట. అయితే ఆమె బాలీవుడ్ అరడజను సినిమాలతో బిజీగా ఉండటంతో నో చెప్పిందని సమాచారం. దీనితో చిత్రబృందం ఆలోచనలో పడిందట.
దీనికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తాడు. ఇంతకీ ఈ పింక్ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు, ఓ లాయర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ఆ ముగ్గురు అబ్బాయిల్లో ఒకరు ఓ అమ్మాయిపై అత్యాచారం చేయాలని చూస్తాడు. ఆమె తప్పించుకునే క్రమంలో బీర్ బాటిల్‌తో అతని తల పగలగొడుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.
ఈ కేసును మొదటి నుంచి డీల్ చేస్తున్న లాయర్ (అమితాబ్ బచ్చన్) ఎలా నెగ్గారు అన్నదే కథ. పవన్ కళ్యాణ్ వయసు, ఇమేజ్ ని బట్టి కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుండి మొదలవుతుందట. మొదటిగా పవన్ కళ్యాణ్ అవసరం లేని సీన్స్ తీస్తారట. ఆ తరువాత ఫిబ్రవరిలో పవన్ ఎంటర్ అవ్వొచ్చంటున్నారు.



