చైతూ ఒక బోరింగ్ పర్సన్ – తమన్నా!

tamanna Says Naga Chaitanya is Boringహీరోయిన్ గా ఉన్న సమంతను అక్కినేని నాగచైతన్య ఏం చెప్పి పడేసాడో గానీ, చైతూ ఒక బోరింగ్ పర్సన్ అంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఓ మీడియా ఛానల్ కార్యక్రమంలో పాల్గొన్న తమన్నా, యువకులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చింది. అందులో భాగంగా… ఓ ఐలాండ్ లో నాగచైతన్యతో పాటు మిమ్మల్ని వదిలిస్తే ఏం చేస్తారు అని అడగగా, దానికి షాక్ ఇచ్చే జవాబు ఇచ్చింది తమన్నా.

మీరు ఒక బోరింగ్ పర్సన్ గురించి అడుగుతున్నారు. చైతూతో ఇప్పటివరకు రెండు సినిమాలలో నటించాను. ఒక్కసారైనా లంచ్ చేద్దామని కొన్ని వందల సార్లు అడిగి ఉంటాను. కానీ, లంచ్ సమయంలో చైతూ నిద్రపోతుంటాడు. ఒకవేళ ఐలాండ్ కు వెళ్ళినా బహుశా చైతూ నిద్రపోతాడేమో, తానేమో కొబ్బరిబొండం నీళ్ళు తాగుతుంటాను అని బదులిచ్చింది.

ADVERTISEMENT

నిజంగా చైతూ అంత బోరింగ్ పర్సన్ అయితే, మరి సమంత ఎలా ఇష్టపడిందో అంటూ ప్రశ్నించడం నెటిజన్ల వంతయితే, బహుశా అతికొద్ది మందికి మాత్రమే చైతూ గురించి పూర్తిగా తెలుసన్న విషయం తమన్నా వ్యాఖ్యల ద్వారా నిరూపితమయ్యిందని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. హీరోయిన్ల విషయంలో చైతూ చాలా రిజర్వుడ్ గా ఉంటారన్న విషయం మిల్కీ బ్యూటీ మాటల ద్వారా అర్ధమవుతోంది.

ADVERTISEMENT
Latest Stories