tamil-directors-cant-impress-telugu-audience

టాలీవుడ్ స్థాయి నుంచి ఇండియన్ సినిమా స్థాయికి ఎదిగిన తెలుగు సినిమా ఇతర భాషా నటులను అక్కరకు చేర్చుకోగలదు, వారిని అభిమానించగలదు. కానీ తెలుగు నాట తమిళ దర్శకుల సినిమాలకు మాత్రం ఇక్కడ ఆదరణ కరువవుతుంది.

అలాగే తెలుగు దర్శకులు వేరే ఇండస్ట్రీ కు వెళ్లి వారి ధోరణిని అర్ధం చేసుకుని, ఆ ఇండస్ట్రీ లో ఆ హీరో కే బ్లాక్-బస్టర్ అందించారు. అందుకు నిదర్శనంగా హిందీ లి హిట్ అందుకున్న అర్జున్ రెడ్డి గాని ఈ మధ్య కాలంలో వచ్చిన ‘యానిమల్’ కానీ చూపించవచ్చు. కానీ, తమిళ దర్శకులు ఇదే ఫార్ములా ను తెలుగు ఇండస్ట్రీ లో అమలుచేసేందుకు చాల ఇబ్బంది పడుతున్నారు.

Also Read – జగన్‌కి ఓదార్పు కావాలి.. ఎవరైనా ఉన్నారా ప్లీజ్?

అప్పట్లో 2000 వ సంవత్సరం ఎస్.జె.సూర్య దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ లీడ్ యాక్టర్ గా వచ్చిన ‘ఖుషి’ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి, ఒక తమిళ దర్శకుడు తెలుగునాట ఒక బ్లాక్-బస్టర్
అందుకున్న రికార్డు ను సొంతం చేసుకున్నారు. అయితే, చిత్రమేంటంటే అప్పటినుండి తమిళ దర్శకులు ఎప్పుడు నేరుగా ఒక తెలుగు చిత్రం తెరకెక్కించినప్పటికీ, ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో విఫలమవుతూనే ఉన్నారు.

మరల ఈ బ్లాక్-బస్టర్ జోడి ‘ఎస్.జె.సూర్య-పవన్ కళ్యాణ్’ లు “కొమరం పులి” అంటూ వచ్చి ఒక డిసాస్టర్ ను ఇండస్ట్రీకి అందించగా, పవన్..’విష్ణు వర్ధన్’ “పంజా” మూవీ కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.

Also Read – చంద్రబాబు నాయుడు విధానాలే కరెక్ట్?

ఇక, ఒకప్పుడు ‘మాస్’ అంటూ కింగ్ నాగార్జున తో వచ్చి సూపర్ హిట్ అందుకున్న రాఘవ లారెన్స్, ఆ తరువాత రెబెల్ స్టార్ ప్రభాస్ తో “రెబెల్” అంటూ వచ్చి ప్రభాస్ అభిమానులకు ఒక పీడ కలను మిగిల్చారు.

అలాగే సూపర్ స్టార్ మహేష్ విషయానికి వస్తే మహేష్ తన సినీ కెరీర్ లో ఇద్దరు తమిళ దర్శకులకు అవకాశం ఇవ్వగా అందులో ఎస్ జె సూర్య ‘నాని’ మూవీ, ఏ.ఆర్.మురుగుదాస్ తో కలిసి వచ్చిన ‘స్పైడర్’ రెండు మహేష్ కెరీర్ లో నే ఒక అతిపెద్ద డిసాస్టర్ గా నిలిచాయి.

Also Read – జగన్‌ మొదలెట్టేశారు.. విజయసాయి రెడీయా?

అప్పటికే తమిళ దర్శకుల ఫ్లాప్ సెంటిమెంట్ తెలుగింట బాగా వినపడినా, ఎనర్జిటిక్ స్టార్ ‘రామ్ పోతినేని-లింగుసామి’ కలిసి “ది వారియర్” అనే చిత్రంతో ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాం అంటూ వచ్చి, మరలా ఆ సెంటిమెంట్ ముందు తలవంచారు.

అదే సమయం లో అక్కినేని వారసుడు ‘నాగచైతన్య-వెంకట్ ప్రభు’ “కస్టడీ” అనే చిత్రంతో చాల కాన్ఫిడెంట్ గా వచ్చినప్పటికీ, సీన్ మారలేదు, మరోసారి తమిళ దర్శకులు తెలుగు ప్రేక్షకులను నిరాశ పరిచి అక్కినేని వారసుడి ఖాతాలో మరో అపజయాన్ని మూటకట్టారు.

ఇక ఈ సంక్రాంతికి విడుదలైన గ్లోబల్ స్టార్ ‘రామ్ చరణ్-శంకర్’ ల “గేమ్ ఛేంజర్” ఈ తమిళ దర్శకులు..తెలుగు ప్రేక్షకుల మధ్య కొనసాగుతున్న గేమ్ ను ఛేంజ్ చేస్తుందేమో అనుకుంటే ఇక్కడ కూడా పరిస్థితులు టాలీవుడ్ కు అంత అనుకూలంగా కనిపించడం లేదు.




గేమ్ ఛేంజర్ సినిమా మీద ప్రేక్షకుల రివ్యూలు వింటున్నప్పటికీ, అభిమానుల అంచనాలను అందుకోవడంలో మరోసారి ఒక తమిళ దర్శకుడు విఫలమయ్యారంటూ ఏకగ్రీవమైన టాక్ వస్తుంది. ఇలా, ఒక్కపుడు తమ తమిళ సినిమాలతో ఇండస్ట్రీ హిట్ లను అందించిన తమిళ దర్శకులు నేడు అదే తెలుగు ప్రజలను ఆకట్టుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. చూడాలి మరి ఈ సెంటిమెంట్ ను ఏ తమిళ దర్శకుడు బ్రేక్ చేస్తాడో అని..!