విభజన తరువాత ఎక్కడ ఎక్కువ పెట్టుబడులు ఎక్కువ వచ్చాయి అంటే అది కచ్చితంగా చెన్నైకి సమీపంలో ఉన్న శ్రీసిటీకే. చెన్నై పోర్టుకు దగ్గరగా ఉండడం అన్ని వసతులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం కూడా దీనికి కారణం. అయితే ఎవరికీ తెలియని ఇంకో నిజం ఉందట. ఇక్కడకు ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా పెట్టుబడులు తమిళనాడు నుండి తీసుకుని వచ్చేసినవేనట.
జయలలిత మరణం అనంతరం తమిళ నాట రాజకీయ అనిశ్చితి పెరిగిపోయింది. అధికారంలో ఉన్న వారికి తమ పదవులు కాపాడుకోవడమే సరిపోతుంది. దీనికి తోడు మళ్ళి పదవిలోకి వస్తామో రామో అని అక్కడ నాయకులు పరిశ్రమల నుండి హఫ్తాలు వసూలు చేసే పనిలో పడిపోయారట.
అక్కడి పారిశ్రామికవేత్తలలో నెలకొన్న అసంతృప్తిని గమనించి చంద్రబాబు అక్కడి పారిశ్రామిక వాడలకు రాష్ట్ర పారిశ్రామిక కార్యదర్శి నేతృత్వంలో ఒక బృందాన్ని అక్కడే పెట్టేశారట. వారు అసంతృప్తిగా ఉన్న పారిశ్రామికవేత్తలను కలవడం వారికి ఆకర్షనీయ తాయిలాలు ఇవ్వజూపి రాష్ట్రానికి తరలించడం ఇదే పని అట.
వీటిగురించి తమిళ పత్రికలు తరచూ ప్రస్తావించిన పట్టించుకునే నాధుడే లేదట. ఇటీవలే ఆర్కే నగర్ ఉపఎన్నికలో దినకరన్ గెలవడం ప్రభుత్వవాన్ని మూడు నెలలో పడగొడతా అని సవాలు చెయ్యడంతో అక్కడ రాజకీయ అనిశ్చితి మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది.



