తమిళులా మజాకా… చుక్కలు చూపిస్తున్నారుగా..!

Tamilians Protest On Jallikattu Banభాష కోసం… కట్టు బొట్టు కోసం… సంస్కృతి సంప్రదాయాల కోసం… ఏకం కావడం ఒక్క తమిళులకే చెల్లుతుంది అనే విధంగా దేశమంతా చాటిచెప్తూ… ‘జల్లికట్టు’పై నాలుగు రోజుల పాటు ప్రత్యేక ఆర్డినెన్స్ తెప్పించుకోవడంలో సక్సెస్ అయిన తమిళ ప్రజలు, తాజాగా సిఎం పన్నీరు సెల్వంకు చుక్కలు చూపిస్తున్నారు. ఎంతగా అంటే… నేడు జల్లికట్టును అధికారికంగా ప్రారంభించడానికని మధురై జిల్లా, అలంగనల్లూరుకు వెళ్ళిన పన్నీరు సెల్వంను స్థానిక యువత అడ్డుకున్నారు.

“తమకు ఈ నాలుగు రోజుల అనుమతులు అవసరం లేదని, ఒక రోజుకో, ఒక ఏడాదికో జల్లికట్టు పరిమితం కాదని, దీనికి శాశ్వత పరిష్కారం కావాలని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు కావాలని” కోరడంతో దెబ్బకు అక్కడ నుండి ముఖ్యమంత్రి సైతం వెళ్ళిపోవాల్సి వచ్చింది. దీంతో జల్లికట్టును అధికారికంగా ముఖ్యమంత్రి ప్రారంభించే స్థలం దిండిగల్ కు మారింది. తమకు శాశ్వత పరిష్కారం చూపని పక్షంలో రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా పరిస్థితులు ఇలాగే ఉంటాయని, నిరసనలు తప్పవని యువత నినాదాలు చేస్తుండడం విశేషం.

ADVERTISEMENT

జల్లికట్టుకు అనుమతులు తీసుకువస్తేనే ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వంను ఆదరిస్తామని తెగేసి చెప్తుండడంతో… తమిళనాడు జనాలు ఎంత పట్టుదలగా ఉన్నారో అర్ధం చేస్తుకోవచ్చు. అయితే ఇప్పట్లో దీనికి శాశ్వత పరిష్కారం సాధ్యం కాదు గనుక, ఈ ఏడాది వరకు అయితే ఇబ్బందులు తలెత్తక పోవచ్చు అన్నది రాజకీయ మరియు మీడియా వర్గాల టాక్.

ADVERTISEMENT
Latest Stories