ఎన్నికల వేళ ప్రతీ ఓటరును పలకరించనున్న టీడీపీ

Kala Venkat Rao - Chandrababu- naiduతెలుగుదేశం పార్టీ ఎన్నికల నగారా మోగిస్తుంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి ఇప్పటినుండే సమాయత్తం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో ప్రతీ వెయ్యి మంది ఓటర్లకు ఒక కన్వీనర్‌ను ఇప్పటికే నియమించారు. ఆయన కింద ప్రతీ 100 మంది ఓటర్లకు ఒక సేవామిత్రను ఏర్పాటు చేశారు.

ADVERTISEMENT

[m9ad]

అంటే ఒక కన్వీనర్‌ పరిధిలో పది మంది సేవా మిత్రలు తగ్గకుండా కార్యరంగంలోకి దూకుతారన్నమాట. ఓటర్లను తమవైపు తిప్పుకోవాలంటే ఇప్పటి నుంచే ప్రతిపక్షాల బలహీనతలను ప్రజలకు చేరవేయడం, ఇదే సమయంలో అధికార పక్షంగా తాము ఎలాంటి చర్యలు తీసుకున్నామో వారికి అర్థమయ్యే రీతిలో వివరించడం, తద్వారా ప్రభుత్వ సానుకూలత సాధించడం దీని వెనుక ఉన్న లక్ష్యం.

రాష్ట్రంలో మరే పార్టీకి లేనంతగా క్షణాల్లో స్పందించే కార్యకర్తలు తెలుగు దేశం పార్టీకి ఉన్నారు. వారిని నడిపించే నాయకులు సిద్ధం అవుతున్నారు. తమ వ్యూహాన్ని సక్రమంగా అమలు చేస్తే విజయం సాధించడం చాలా తేలిక అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీనికోసం పార్టీ ఇప్పటికే ఏలూరులోని పార్టీ కార్యాలయంలో ఐదు వేల మంది బూత్‌ కన్వీనర్లకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేయగలిగారు

ADVERTISEMENT
Latest Stories