botsa-satyanarayana-mlc-elections-2024

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకి టిడిపికి ‘లైన్ క్లియర్’ చేసింది. వైసీపి నేత బొత్సకి టిడిపి లైన్ క్లియర్ అంటే పార్టీలో చేరేందుకు కాదు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వైసీపి అభ్యర్ధిగా బరిలో దిగుతున్న ఆయనకు ఉపశమనం కలిగిస్తూ పోటీ నుంచి విరమించుకుంది.

స్థానిక సంస్థల కోటాలో జరుగబోయే ఈ ఉప ఎన్నికలో జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాల్ కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఓటర్లుగా ఉంటారు. వారిలో 75 శాతం మంది వైసీపికి చెందినవారే.

Also Read – వైసీపీ నేతల రిమాండ్ కష్టాలు…

అయినప్పటికీ టిడిపి పోటీ చేస్తే క్రాస్ ఓటింగ్ జరిగి గెలుస్తుందని భావించినప్పటికీ, గెలిచినా, ఒదినా దాని వలన అపఖ్యాతి తప్పదని భావించిన సిఎం చంద్రబాబు నాయుడు ఈ ఉప ఎన్నికలో టిడిపి పోటీ చేయకపోవడమే మంచిదని నిర్ణయించారు.

కనుక బొత్స సత్యనారాయణకి టిడిపి లైన్ క్లియర్ చేసింది కనుక ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైన్నట్లు ప్రకటించడం లాంఛనప్రాయమే.

Also Read – జమ్ము కశ్మీర్‌ దాడి: అందరి తాపత్రయం మైలేజ్ కోసమే?


ఇది ఆయనకి, ముఖ్యంగా వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డికి, వారి సొంత మీడియా, సోషల్ మీడియా న్యాయం, ధర్మం, అవినీతి, కుట్రలు అంటూ గొప్పగా చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది కూడా. దాని వలన టిడిపికి వచ్చే నష్టం ఏమీ లేదు కానీ జిల్లాలోని స్థానిక సంస్థలలో వైసీపికి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ, ఆందోళన కలిగేలా చేయడం, ఆ భయంతోనే గతంలో ఎన్నోసార్లు మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణని ఎమ్మెల్సీగా బరిలో దించడం, ఆ భయంతో ఆయన పరుగులు పెట్టాల్సిరావడంతోనే టిడిపి సగం విజయం సాధించిందని చెప్పవచ్చు. కనుక బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఎన్నికైనా అదేమీ ఆయనకు, వైసీపికి కూడా గర్వకారణం కాబోదు.