ఫ్లాష్ ఫ్లాష్… ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత!

Anam -Vivekananda Reddy is No More-తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. సికింద్రాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, కుటుంబసభ్యులు ఆయనను కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. కొన్ని వారాలుగా కిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు ఉదయం కన్నుమూశారు.

గత ఎన్నికల తర్వాత తన సోదరుడు, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డితో కలసి ఆయన టీడీపీలో చేరారు. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కిమ్స్ ఆసుపత్రికి వచ్చి, ఆనంను పరామర్శించారు. మరోవైపు వివేకా మృతితో టీడీపీ, కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories