తెలుగుదేశం పార్టీకి చెందిన 36 ఏళ్ళ తోట చంద్రయ్య పట్టపగలు నడిరోడ్డు పైన హత్యకు గురికాబడ్డారు. ఈ రోజు ఉదయం చంద్రయ్య వెళ్తున్న బైక్ కు కర్ర అడ్డం పెట్టి పడగొట్టిన తర్వాత కత్తులు, కర్రలతో దాడి చేయడంతో అక్కడిక్కడే తుది శ్వాస విడిచారు.
గుంటూరు జిల్లా, వెల్దుర్తి మండలం, గుండ్లపాడులో జరిగిన ఈ సంఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాచర్ల పోలీసులు చేరుకొని పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా గుండ్లపాడుకు పయనం అయ్యారు.
ఇది అధికార పార్టీ వైసీపీ రౌడీల హత్యగా తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియాలో పోస్ట్ లు చేసింది. నడి బజార్లో చంద్రయ్య గొంతు కోస్తున్న వైసీపీ ఫ్యాక్షనిస్టులు అంటూ అభివర్ణించింది. ఈ రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నా, అత్యంత కిరాతకంగా చంద్రయ్య హత్యకు గురి కావడం మాత్రం ఖండించదగ్గ విషయం.
ఈ హత్యపై అధికార పార్టీ వర్గాలు ఎలాంటి సమాధానం ఇస్తారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ప్రతిపక్ష పార్టీ టిడిపి చేస్తోన్న ఆరోపణలను తిప్పికొడతారా? లేక నిందితులను సకాలంలో పట్టుకుని మీడియా ముందు పెట్టి పూర్తి వివరణ ఇస్తారా? అన్నది వేచిచూడాలి.
గతంలో టిడిపి ఆఫీస్ పై ఇలాగే దుండగులు దాడి చేసిన సమయంలో, ప్రతిపక్ష పార్టీ వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో… ఎవరో అభిమానులు బిపి వచ్చి ఇలా చేసారంటూ నాడు ముఖ్యమంత్రి వివరణ ఇవ్వగా, ఉండవల్లి లాంటి ప్రముఖులు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే.
దీంతో నేడు జరిగిన హత్యాకాండపై అధికార పార్టీ నేతలు గానీ, ముఖ్యమంత్రి గానీ ఎలాంటి సమాధానం ఇస్తారోనని వేచిచూస్తున్నారు. పొలిటికల్ హీట్ ను రగిల్చిన ఈ హత్యతో పలనాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మాచర్ల నియోజకవర్గం వెల్లుర్తి మండలం గుండ్లపాడులో తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రయ్యను కర్రలు, రాళ్లతో కొట్టి హత్యచేసిన దుండగులు. #DemocracyBackSlidingInAP pic.twitter.com/gBNWGtRehJ
— iTDP Official (@iTDP_Official) January 13, 2022
నడి బజార్లో చెంద్రయ్య గొంతు కోస్తున్న @YSRCParty ఫ్యాక్షనిస్టులు! #DemocracyBackSlidingInAP #EndOfYCP pic.twitter.com/Vbup32XoVW
— iTDP Official (@iTDP_Official) January 13, 2022
హత్యలు, ఫ్యాక్షన్ చేసేవారికి పదవులు కట్టబెట్టడం జగన్ రెడ్డి మార్క్ రాజకీయం! #DemocracyBackSlidingInAP pic.twitter.com/mVowvym5IA
— iTDP Official (@iTDP_Official) January 13, 2022



