గత ప్రభుత్వం లో మంత్రులందరికీ జగన్ ఒక్కటే బాధ్యత అప్పగించేవారు. ఆ మంత్రి ఏ శాఖకు సంబంధించిన బాధ్యతలు తీసుకున్నా, ఏ శాఖకు సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టినా స్క్రిప్ట్ లో మార్పు ఉండదు…వారి బూతులతో తేడా ఉండదు. మాజీ ముఖ్యమంత్రికి మీడియా అంటే భయం..మాజీ మంత్రులకు మీడియా అంటే బరితెగింపు.
Also Read – వై నాట్ అసెంబ్లీ… ఈ 11 ఆ 11 ని పిలుస్తుంది..!
కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నా ఒక్కో నేత ఆ శాఖకు సంబంధించిన పూర్తి వివరాలను సమీక్షలు చేసుకుని ప్రజల ముందు ఉంచుతున్నారు. అది ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయినా లోకేష్ అయినా, నాదెండ్ల అయిన, అనిత అయినా ఒక్కటే అనేటట్లు బాధ్యతగా పాలన చేస్తున్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న బాబు పదవి చేతికి రాగానే ఆధారాలు లేని ఆరోపణలు కాకుండా గాలిలో లెక్కలు చెప్పకుండా అమరావతి మీద పోలవరం మీద పూర్తిగా సమీక్ష జరుపుకుని ఆధారాలతో వీడియో ల సాక్షిగా ప్రజల ముందుంచారు. అమరావతి పనులు గత టీడీపీ ప్రభుత్వంలో ఎలా జరిగాయి వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాటిని ఈమేరకు ముందుకు తీసుకు వెళ్లారు అనేది ఒక వీడియో ప్రజంటేషన్ రూపంలో ప్రజల ముందు పరిచారు.
Also Read – టిడిపి సభ్యత్వ నమోదు చేసుకుంటే వైసీపి….
అలాగే పోలవరం విషయంలోనూ ముందుకెళ్లారు. ఇక పవన్ కూడా పదవి బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి గంటల తరబడి తన శాఖల మీద సమీక్ష సమావేశాలు జరుపుతూనే ఉన్నారు. తవ్వే కొద్దీ వైసీపీ అవినీతి బయటపడుతూనే ఉందని, ఆయా శాఖలను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరముంది అంటు వ్యాఖ్యానించారు. తాజాగా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా ముందుకొచ్చారు.
తానూ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నడూ శాఖ పరంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పని అంబటి ఇప్పుడు మాత్రం తనలో ఉన్న కళ నైపుణ్యానంత ప్రదర్శిస్తున్నారు. తన హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయలేకపోయిన అంబటి బోర్డుల మీద బొమ్మల రూపంలో పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మించేశారు, పోలవరం గేట్లు సరిచేసేసారు.
Also Read – చిచ్చుబుడ్డి లా లేచి..తుస్సుమన్నారు..!
ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యేక మీడియా ముందుకొచ్చి ప్రజలకు సమాధానము చెప్పాలని, పోలవరం ఆగిపోయిన పాపం బాబుదే అని, ఏపీ ఆస్తులు తెలంగాణ ప్రభుత్వానికి తాకట్టు పెడతారా అంటు రాష్ట్రము మీద ఎక్కడ లేని ప్రేమ పొంగింస్తున్నారు మాజీ మంత్రి అంబటి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే ప్రభుత్వం పై తన రివ్యూ ఇవ్వడానికి తొందర పడుతున్నారు.
అయితే జగన్ కేసీఆర్ ల భేటీ తరువాత కానీ జగన్ ముఖ్యమంత్రిగా మోడీ తో భేటీ అయినప్పుడు కానీ జగన్ ఎప్పుడు ప్రజలకు వివరణ ఇవ్వడానికి మీడియా ముందుకు రాలేదే.? రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టినప్పుడు ప్రజలకు చెప్పిందా.? అసలు ఏపీ ఆస్తులను తెలంగాణ ప్రభుత్వానికి ఒకేఒక్క సంతకంతో దారాదత్తం చేసిందే జగన్ కదా.
ఏపీ ఆస్తులలో తెలంగాణకు వాటా ఇస్తున్నామని ఏపీ ప్రభుత్వం కానీ ఇరు రాష్ట్రాల అధికారులు కాని ఎక్కడ నిర్దారించలేదు. తమ నీలి మీడియాలో వేసుకున్న తప్పుడు వార్తలకు ప్రభుత్వం సంజాయిషీ ఇవ్వాలా.? మంత్రుల నుంచి మాజీలకు వచ్చిన వైసీపీ నాయకుల బుద్ది మాత్రం మారడం లేదు. అవే తప్పుడు వార్తలు, అవే తప్పుడు ప్రచారాలు. ఈ ప్రచారాలను ఛీ కొట్టే వైసీపీ ని 151 నుండి 11 కు తెచ్చారు.