టీడీపీ శ్రేణులలో చిగిరిస్తున్న ఆశలు ఫలించేనా?

TDP-Protestsగడిచిన నెల రోజుల నుంచి చంద్రబాబు అరెస్టుతో నిస్తేజంలో ఉన్న టీడీపీ శ్రేణులకు న్యాయస్థానాల తీర్పులు మరింత కుంగతీశాయనే చెప్పాలి.చంద్రబాబు వేసిన బెయిలు పిటిషన్లు విచారణకు రాకా,ఒకవేళ విచారణకు వచ్చినా వాయిదాలతో తీర్పులను ముగించడం,మరి కొన్ని సార్లు న్యాయస్థానాలలో బాబుకి వ్యతిరేకంగా తీర్పులు వెలువడడం ఇలా ఎటుచూసైనా టీడీపీ కి వ్యతిరేక పవనాలే వీచాయి.

అయితే రోజులు గడిచే కొద్దీ కేసులో ఉన్న లోపాలు బయటపడో లేక ప్రభుత్వం సరైనా ఆధారాలు చూపలేకనో మొత్తానికి చంద్రబాబుకి ఒక్కో కేసు నుండి కొంత ఊరట లభించడం టీడీపీ శ్రేణులలో నూతనోత్సహాన్ని కలిగిస్తుంది. రెండు రోజుల క్రితం బాబు వేసిన ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిలుకు కోర్ట్ అనుమతి లభించడం, తాజాగా అంగళ్ల కేసు నుండి కూడా బాబుకి బెయిలు రావడంతో టీడీపీ నేతలలో అనందం కనిపిస్తుంది.

ADVERTISEMENT

ఎన్నికలు పూర్తి అయ్యే వరకు చంద్రబాబు బయటకు వచ్చేది లేదు అంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలతో ఆశలు చంపుకున్న టీడీపీ నాయకులకు తాజా పరిణామాలు కొంత ఊరట కలిగిస్తున్నాయి. ప్రభుత్వం చంద్రబాబు పై పెట్టిన ఈ అక్రమ కేసుల నుండి ఎలా అయితే బాబుకి ఊరట దొరికిందో అలాగే స్కిల్ స్కాం అంటూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ విషప్రచారాల నుండి, ఈ తప్పుడు కేసులనుండి కూడా బాబు నిర్దోషిగా బయటకు వచ్చి తీరుతారని బలంగా నమ్ముతున్నారు టీడీపీ క్యాడర్.

ఇప్పటికే స్కిల్ కేసులో అవినీతి అంకెల సంఖ్యను తగ్గించిన సిఐడి అధికారులు..,౩వేల కోట్ల నుండి 27 కోట్లకు తగ్గిన ఆరోపణలు, అంతకు మందే లోకేష్ చెప్పినట్టు అవి జీరో కి చేరే రోజు తొందరలోనే రానున్నట్టే ఉందని టీడీపీ మద్దతుదారులలో ఆశలు చిగురిస్తున్నాయి. టీడీపీ నేతలు ఆశించినట్లే చంద్రబాబు జైలు నుండి ప్రజా క్షేత్రంలోకి అడుగుపెడితే ఈ నెలరోజుల నిశ్శబ్దాన్ని రాబోయే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి గట్టిగా వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారనే చెప్పాలి.

మరో రెండు రోజులలో కోర్ట్ చంద్రబాబుకి విధించిన రిమాండ్ పూర్తి కావడంతో విచారణ మరల కోర్ట్ మెట్లెక్కనుంది. ఈ సరి విచారణకు న్యాయస్థానానికి చంద్రబాబు హాజరయ్యే అవకాశం ఉండడంతో బాబు కోర్ట్ నుండి తిరిగి ఇంటికి రావాలని వస్తారని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అటు బాబు కుటుంబసభ్యులు ఇటు టీడీపీ క్యాడర్. చూడాలి మరి టీడీపీ నేతల ఆశలు ఫలిస్తాయా? లేక వైసీపీ వ్యూహాలు నెగ్గుతాయో!

ఈ సారి చంద్రబాబుకి జగన్ సృష్టించిన గ్రహణం తప్పకుండా వీడుతుంది అనే ఆశలో తెలుగు తమ్ముళ్లు ఎదురుచూస్తున్నారు. చంద్రుడికి గ్రహణం వీడితే ఇక రాష్ట్రంలో “జగన్నాటకాలకు” గ్రహణం పట్టినట్టేనా? అనే సందేహాలు ఏపీ ప్రజలకే కాదు వైసీపీ నేతలలోను మొదలవడం ఖాయం అంటున్నారు రాజకీయ విజ్ఞులు.

ADVERTISEMENT
Latest Stories