ఇది మూడో సారి… టీమిండియాకు భంగపాటు..!

team india vs england 2nd odiఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరుగుతోన్న టీ20 సిరీస్ లో మొదటి మ్యాచ్ ను గెలిచి మంచి ఉత్సాహంలో ఉన్న టీమిండియా, రెండవ మ్యాచ్ లో ఓటమి పాలయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 148 పరుగులే చేసిన టీమిండియా లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి హెల్స్ (58) సాయంతో అందుకుంది ఇంగ్లాండ్. దీంతో మొదటి రెండు మ్యాచ్ లు ముగిసే సమయానికి 1-1తో సిరీస్ సమంగా నిలిచింది.

దీంతో ఆదివారం నాడు జరగనున్న మూడవ మ్యాచ్ లో సిరీస్ విజేత నిర్ణయం కానుంది. అయితే గత 7 టీ 20 మ్యాచ్ లలో వరుసగా విజయం సాధించిన టీమిండియాకు 8వ మ్యాచ్ లో భంగపాటుకు గురికావడం ఇది మూడవ సారి కావడం విశేషం. 2014, 2016 సంవత్సరాలలో కూడా ఇలాగే వరుసగా 7 మ్యాచ్ లు గెలిచి, 8వ మ్యాచ్ లో బోల్తాపడడంతో, టీమిండియాకు 8వ మ్యాచ్ అచ్చిరాని సెంటిమెంట్ గా మారింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories