విజయవాడలో న్యూస్ రీడర్ ఆత్మహత్య?

tejaswini news readerగతంలో ఓ న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పని చేసిన తేజశ్విని ఆదివారం రాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. విజయవాడ శివార్లలో ఉన్న ఈడుపుగల్లు, ఎంబీఎంఆర్ కాలనీలో గత కొంతకాలంగా తేజశ్విని మరియు ఆమె భర్త పవన్ కుమార్ ఉంటున్నారు. తేజశ్విని ఓ ఛానల్ లో న్యూస్ రీడగా విధులు నిర్వహించగా, పవన్ కుమార్ ఉయ్యూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు.

ఆదివారం నాడు రాత్రి సమయంలో అత్త అన్నపూర్ణాదేవి – తేజశ్విని మధ్య వాగ్వివాదం జరుగగా, అనంతరం ఆమె గదిలోకి వెళ్లి, ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతకూ తేజశ్విని రాకపోవడంతో… అనుమానం వచ్చిన అత్త గదిలోకి వెళ్ళగా, ఫ్యాన్ కు వేలాడుతూ తేజశ్విని కనిపించడంతో, వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories