టి. బీజేపీ ప్రేక్షక పాత్రకు ముగింపు పలికిందా.?

పవన్ టార్గెట్ గా సాగుతున్న తెలంగాణ రాజకీయాలలోకి ఇప్పుడు కొత్తగా టి. బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. నిన్న ఏపీలో పవన్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో మీ పై తెలంగాణలో జరుగుతున్న రాజకీయ దాడి పై బీజేపీ నేతల ప్రేక్షక పాత్ర పై అంటూ మీడియా ప్రతినిధులు పవన్ పై సంధించిన ప్రశ్నలకు నేడు టి. బీజేపీ సమాధానం చెప్పింది.

టి. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మొదలుకుని ఆ పార్టీ ఎంపీ రఘునందన్ వరకు అందరు అటు అధికార కాంగ్రెస్ పై ఇటు ప్రతిపక్ష బిఆర్ఎస్ పై ఎదురుదాడి మొదలుపెట్టారు. రేవంత్ రెడ్డి వేరే రాష్ట్రాలకు వెళ్లి ఎన్నికల ప్రచారాలు చెయ్యొచ్చు, కేసీఆర్ పోయి వేరే రాష్ట్రాలకు పైసలు ఇచ్చి రావచ్చు,

ADVERTISEMENT

కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణలో సభ పెట్టుకోకూడదా అంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ ఇరు పార్టీల నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. అలాగే రామచంద్రరావు సైతం పవన్ కు మద్దతుగా నిలిచారు.

ప్రధాని నరేంద్ర మోడీ హైద్రాబాద్ పర్యటనలో భాగంగా నాడు టీడీపీ అధినేత బాబు ని జనసేన అధినేత పవన్ ను ఆకలిసిన తరువాతే తెలంగాణలో పవన్ పై ఇటువంటి కుట్ర రాజకీయాలు మొదలయ్యాయన్నారు.

కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్టుగా, బిఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నట్టుగా పవన్ ఎన్నడూ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదంటూ ఇన్నాళ్ల బీజేపీ ప్రేక్షక పాత్రకు ఒక ముగింపు పలికారు.

ADVERTISEMENT
Latest Stories