తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో సోషల్ మీడియాలో జోకులకు నిలయం అయ్యింది. ఇప్పటికే నెలకు ఐదు వేల చప్పున ఇంటి బాడుగ కడతామని వారు చేసిన ప్రకటన విమర్శలకు దారి తీసింది. ఇప్పుడు పాక్షిక మద్యనిషేధం అంటూ ఇంకొక్క ఆసక్తికరమైన ప్రకటన చేసింది ఆ పార్టీ. తాము అధికారంలోకి వస్తే బార్లు. వైన్ షాపులను సాయంత్రం 6 ఇంటికే మూసేసేలా చేస్తామని చెప్పుకొచ్చారు.
[m9ad]
అయితే దీనితో మందు బాబులు ఆ పార్టీ పై గుస్సా అవుతున్నారు. బీజేపీని మట్టికరిపించడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు బార్లు వైన్ షాపులు ఆరు గంటలకే మూసేస్తే మీరు ప్రకటిస్తున్న 5000 ఇంటి బాడుగా, రైతు రుణమాఫీ లాంటి వాటికి నిధులు ఎక్కడ నుండి వస్తాయని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.
అయితే సాధ్యాసాధ్యాలు తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు కదా? జరిగినప్పుడు చూదాంలే అని బీజేపీ నేతలు కూడా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఇప్పటికి ఉన్న పరిస్థితి బట్టి బీజేపీ గతసారి గెలుచుకున్న ఐదు సీట్లు కూడా నిలబెట్టుకోవడం కూడా కష్టం. తెలంగాణాలో ఎన్నికలు డిసెంబరు 7న జరగబోతున్నాయి. ఆ నెల 11న ఫలితాలు వస్తాయి.



