జగ్గారెడ్డి అరెస్టు తరువాత… ఇప్పుడు రేవంత్ రెడ్డికి నోటీసులు

Telangana Government notices to Revanth Reddyఎన్నికల వేళ ప్రతిపక్ష నాయకులను ఇరుకున పెట్టే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. జగ్గారెడ్డి అరెస్టు తరువాత ఇప్పుడు రేవంత్ రెడ్డి వంతు వచ్చింది. హౌసింగ్‌ సొసైటీ కేసులో రేవంత్‌రెడ్డికి జూబ్లీహిల్స్‌ పోలీసుల నోటీసులు జారీ చేశారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ఇళ్ల స్థలాలు అమ్మారని రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి.

[m9ad]

ADVERTISEMENT

కాగా నోటీసులపై తన సమాధానం తెలపడానికి సమయం కావాలని రేవంత్‌ రెడ్డి కోరినట్లు పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ కేసులో రేవంత్‌రెడ్డితో పాటు 13 మందికి నోటీసులు ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. సమాధానం చెప్పేందుకు వారికి 15 రోజుల సమయమిచ్చామన్నారు.

ఎన్నికల ప్రచారంలో ఉన్నానని, కొంత సమయం కావాలని రేవంత్‌రెడ్డి లేఖలో కోరారన్నారు. అయితే ఈ దశలో ఎవరినీ అరెస్ట్‌ చేసే అవకాశం లేదని సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష నేతలను కేసులలో ఇరికించి భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని ఆరోపిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories