తెలంగాణ హైకోర్టు వేదికగా జరుగుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదొక కారణం పేరు చెప్పి విచారణను వాయిదా వేయాలని న్యాయవాదులు కోరడంపై కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
దాల్మియా సిమెంట్స్ కు చెందిన పునీత్ దాల్మియా దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు వివాహం కారణంగా విచారణ వాయిదా వేయాలని గడువు కావాలని ఆయన తరపు న్యాయవాది కోరగా, జగన్ హాజరు మినహాయింపునకు సంబంధించిన పిటిషన్ లో వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హాజరు కావాల్సి ఉందని, దీనికి ఒక రోజు వాయిదా వేయాలని జగన్ తరపు న్యాయవాది కోరారు.
పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయడానికి న్యాయవాదులందరి అంగీకారంతో విచారణ ప్రారంభమైందని, ఇపుడు వాయిదాలు వేయమనడం సరికాదని అసహనం వ్యక్తం చేస్తూ, ఇకపై వాయిదా కోరితే రోజుకు 50 వేల చొప్పున హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించేలా ఆదేశాలు ఇస్తామని తీవ్రంగా హెచ్చరించింది.



