మనకు, సినిమాలకు అస్సలు పడదు, అందులో డౌట్ లేదు!

telangana kavitha about moviesజీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జయకేతనం వెనుక కీలక పాత్ర పోషించిన తర్వాత కేసీఆర్ కుమార్తె, కేటీఆర్ సోదరి కవిత చేసిన “వారసత్వం” ప్రకటన హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. తాజాగా వై మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ‘వారసత్వం’ మరియు తన వ్యక్తిగత విషయాలపై మరింత లోతుగా ప్రస్తావించారు కవిత.

ADVERTISEMENT

“ప్రజలు ఆమోదం పొందిన తర్వాతే తానూ ప్రకటించానని, అయినా ఒకసారి డిక్లేర్ చేసేసిన తర్వాత మళ్ళీ దాని గురించి ప్రస్తావన ఎందుకు.., జీహెచ్ఎంసీ ఎన్నికల విజయం తర్వాత మరో శాఖను కేటీఆర్ కు అప్పచెప్పడం అనేది ప్రమోషన్ కాదని, మరింత బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారని” చెప్పుకొచ్చారు.

“మనకు, సినిమాలకు అస్సలు పడదని, సినీ రంగంలోకి వెళ్ళే అవకాశం ఏ మాత్రం లేదని, అలాగే విద్యా రంగంలో వ్యాపారం చేసేటంత ఓపిక తనకు లేదని, తన భర్త మాత్రమే బిజినెస్ లు చూసుకుంటారని, తను కూడా విద్యా రంగంలోకి వెళ్ళే ఆలోచనలు కూడా లేవని” తన వ్యక్తిగత వ్యాపార విషయాలపై కూడా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసారు నిజామాబాద్ ఎంపీ.

ADVERTISEMENT
Latest Stories