మాంచి కిక్కిచ్చిన లిక్కర్ సేల్స్..!

jagan govt prohibition of alcohol

ప్రభుత్వ ఖజానాను నింపడానికి మందుబాబులు ఎప్పుడు ముందు వరుసలోనే నిలబడతారని మరో సారి న్యూ ఇయర్ వేడుకల ద్వారా నిరూపించుకున్నారు. న్యూ ఇయర్ వేడుకలలో ప్రభుత్వానికి సింహం భాగం ఆదాయం మందు, విందు ద్వారానే లభిస్తుందని మరోసారి రుజువయ్యింది.

ADVERTISEMENT

గత ఏడాది చివరి మూడు రోజులలోనే తెలంగాణ ప్రభుత్వం సుమారుగా 658 కోట్ల రూ. లిక్కర్ అమ్మకాలు జరిపిందంటూ లెక్కలు బయటకొచ్చాయి. డిసెంబర్ 31 న 19 ప్రభుత్వ డిపోల పరిధిలో 1 .3 లక్షల మద్యం కేసులు, 1 .35 లక్షల బీర్ల అమ్మకాలతో ఒక్కరోజే ప్రభుత్వానికి 125 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టారు మద్యం ప్రియులు.

అలాగే ఈ మూడు రోజులలో 4 .76 లక్షల లిక్కర్ కేసులు ,6 .31 లక్షల బీర్ కేసుల అమ్మకాలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మందు బాబులు తమ మద్యం కొనుగోళ్లతో అటు ప్రభుత్వానికి ఇటు మద్యం దుకాణదారులకు మాంచి కిక్ ఇచ్చారు. ఏదేమైనా తమ జేబులు కాళీ చేసుకుంటూ…,ఒళ్ళు గుల్ల చేసుకుంటూ..,ప్రభుత్వానికి ఆదాయ మార్గంగా నిలబడుతున్న ఈ మందుబాబుల త్యాగాలకు సమాజంలో విలువే లేకపాయే పాపం.

ADVERTISEMENT
Latest Stories