కాంగ్రెస్ నేతల ఈ ఆవేశం ఎవరి కోసం.?

Congress leaders in Telangana ticket race

తెలంగాణ వాదం అనే పేరుతో తెలంగాణ నాయకులు ఆంధ్రా పాలకులను, ఇక్కడి ప్రాంతాన్ని అవమానించేలా చేస్తున్న రాజకీయాలకు ఎప్పుడో కాలం చెల్లిందని బిఆర్ఎస్ ఓటమితోనే నిరూపితమయ్యింది. అయినా కొంతమంది నేతలు ఇప్పటికి ఆ వాస్తవాన్ని అంగీకరించలేక ఆ మూస పద్దతిలోనే ముందుకెళ్లాలని భావిస్తున్నారు.

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఆ పార్టీ నాయకులు, కల్వకుంట్ల కుటుంబ సభ్యులు అందరు కూడా బాబు ని తెలంగాణ బూచిగా చూపిస్తూ, టీడీపీ పార్టీని తెలంగాణ ద్రోహిగా చిత్రీకరిస్తూ తమ రాజకీయాలను ముందుకు తీసుకెళ్లారు.

ADVERTISEMENT

అందు కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బహిరంగంగా వ్యతిరేకించిన వైసీపీ పార్టీని, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ని రాజకీయ మిత్రులుగా చేసుకున్నారు. ఏపీలో టీడీపీకి రిటర్న్ గిఫ్ట్ అంటూ బాబు ని అధికారానికి దూరం చేసారు. దానితో బిఆర్ఎస్ కొంతకాలం అధికారంగా ముందుకెళ్లగలిగింది, అలాగే కేసీఆర్ రాజకీయంగా ముందడుగు వేయగలిగారు.

కట్ చేస్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో అటు తెలంగాణలో ఇటు ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలు, బాబు అరెస్టు ఆ పై బిఆర్ఎస్ నేతల ప్రకటనలు బిఆర్ఎస్ దశాబ్దకాలం అధికారాన్ని దూరం చేసింది. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి అనే హోదాను కేసీఆర్ నుంచి లాగేసింది.

తెలంగాణ రాజకీయాలలోకి ఆంధ్రావాళ్ళు రాకూడదు అంటూ షరతులు పెట్టిన బిఆర్ఎస్ చివరికి అదే తెలంగాణ లో అధికారానికి దూరమయ్యింది. అలాగే తెలంగాణలో తనకున్న అధికారంతో ఏపీ రాజకీయాలను శాసిద్దాం, వేరెవరికో తెరచాటు సాయం చేసేద్దాం అనుకున్న కేసీఆర్ చివరికి ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యి వేరొకరి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

సరిగ్గా ఇప్పుడు కాంగ్రెస్ లోని కొంతమంది రాజకీయ నాయకులు కేసీఆర్ మాదిరి ఆంధ్రా నాయకుల మీద అతిగా ఆవేశ పడుతున్నారు, తెలంగాణ లో ఇతర పార్టీలకు అనుమతి లేదు అంటూ షరతులు పెడుతున్నారు, ప్రాంతీయవాద రాజకీయాన్ని ప్రోత్సహిస్తు ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయ విద్వేషాలను రెచ్చకొడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీలో కూడా కేవలం కొంతమంది నాయకులు మాత్రమే ఈ తరహా రాజకీయాలు చేస్తున్నారు. వారి ఈ రాజకీయాల వెనుక కూడా ఎవరికో సాయం చేసే ఉద్దేశం ఉందా.? వేరేవరికోసమో వారి గొంతు ఇలా వినిపిస్తున్నారా.? వీరి అతి ఆవేశం రేవంత్ దశాబ్దాల రాజకీయ కష్టాన్ని, కాంగ్రెస్ ఐదేళ్ల అధికారాన్ని సర్వ నాశనం చేయనుందా.?

ADVERTISEMENT
Latest Stories