మణిశర్మ ఇంట్లో దొంగతనం!

Mani-Sharma-ఒకప్పుడు టాలీవుడ్ టాప్ సంగీత దర్శకుడిగా వెలుగొందిన మణిశర్మ ఇంట్లో దొంగతనం జరిగింది. తన ఇంట్లోని బీరువాలో భద్రపరిచిన 4 లక్షలను దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులకు మణిశర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఫిలింనగర్‌ లోని తన ఇంట్లో కొద్ది రోజుల క్రితం 4 లక్షల నగదును బీరువాలో భద్రపరిచారు.

స్వీయ అవసరాల నిమిత్తం ఆదివారం నాడు ఆ డబ్బు కోసం బీరువా తీయగా అది కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించిన మణిశర్మ, తన మేనేజర్ సుబ్బానాయుడు ద్వారా పోలీసులకు ఫిర్యాదు పంపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఇది ఇంటి దొంగల పనే కావచ్చని అనుమానిస్తున్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు. మరి పోలీసులకు ఎలా చిక్కుతాడో చూడాలి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories