These Four Years Are Crucial For AP Development

విభజనతో చితికిపోయిన ఆంధ్రప్రదేశ్ వైసీపీ హయాంలో మరింతగా నష్టపోయిందనే చెప్పాలి. ఇటు ఆర్థికంగా పొరుగు రాష్ట్రాలతో పోటీ పడలేక, అటు రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఇతర రాష్ట్రాల ముందు నిలబడలేక అన్ని విధాలా ఏపీ విధ్వంశం దిశగా పయణమించింది.

అయితే ఈ విధ్వంసానికి వైసీపీ ప్రభుత్వానికి, జగన్ పార్టీ కి పరోక్ష సాయమందించారు తెలంగాణలోని బిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం. ఏపీ ఎదుగుదల, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అమరావతి నిర్మాణం తెలంగాణ అభివృద్ధికి, హైద్రాబాద్ విస్తృత విస్తరణకు అడ్డుకట్ట వేస్తుందనే దురాలోచనతో బిఆర్ఎస్ వైసీపీ కి పరోక్ష మద్దతు తెలియచేసింది.

Also Read – ముందు టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించండి మహాప్రభో!

2014 ఉమ్మడి ఏపీ విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన తొలి ఎన్నికలలో ఏపీలో టీడీపీ, తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. అయితే ఏపీ రాజధాని అమరావతి అనే ప్రకటనతో ఒక్కసారిగా హైద్రాబాద్ రియలెస్టేట్ వ్యాపారం మొత్తం ఏపీకి తరలి వచ్చింది.

అలాగే ఇటు పారిశ్రామికంగా, అటు పెట్టుబడుల పరంగా కూడా ఆ ఐదేళ్లు ఏపీ పొరుగు రాష్ట్రమైన తెలంగాణాకు గట్టి పోటీ ఇచ్చిన మాట వాస్తవం. అయితే వైసీపీ రాకతో, రాజధాని మార్పుతో ఏపీ కకావికలమయిపోయింది.పెట్టుబడులు లేక, పరిశ్రమలు రాక ఎన్నడూ లేని విధంగా గత ఐదేళ్లు ఏపీలో అనేకమంది పక్క రాష్ట్రాలకు వలస బాట పట్టారు.

Also Read – ప్రమోషన్స్‌ అంటే ఇలా.. అందరూ చూసి నేర్చుకోండయ్యా!

అయితే ఈ ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో అభివృద్ధి ఏ స్థాయికి దిగజారిందో అదే స్థాయిలో పక్కన ఉన్న తెలంగాణ రాజధాని హైద్రాబాద్ అత్యంత వేగంగా విస్తరించింది. అంటే ఏపీలో వైసీపీ ఉంటే హైద్రాబాద్ అభివృద్ధికి డోకా వుండదు అనే ఒక బలమైన అభిప్రాయం తెలంగాణ రాజకీయ పార్టీలకు ఏర్పడిపోయింది.

ఆ కారణంతోనే 2024 ఎన్నికలలో కూడా ఏపీలో వైసీపీ నే అధికారంలోకి వస్తుంది, మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతాడు అంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చిలకజోస్యాలు కూడా చెప్పారు. అయితే పొరుగు రాష్ట్ర వినాశనాన్ని కోరుకున్న పార్టీలు సొంత రాష్ట్రంలో నాశనమయ్యాయి. పదేళ్ల అధికారానికి దూరమై కనీసం ప్రజా క్షేత్రంలోకి కూడా రావడానికి జంకుతూ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు పార్టీ పెద్దలు.

Also Read – HIT 3: అడివి శేష్ ఫైట్ సీన్ లీక్‌తో సర్‌ప్రైజ్!

ఐదేళ్ల వైసీపీ విధ్వంసానికి, బిఆర్ఎస్ కుటిల రాజకీయాలకు ప్రతీకారంగా 2024 ఎన్నికలు ఏపీలో వైసీపీని భూస్థాపితం చేస్తే, 23 ఎన్నికలు తెలంగాణలో బిఆర్ఎస్ ను మట్టి కరిపించాయి. అయితే ఈసారి రాబోయే ఎన్నికలలో వచ్చేది మేమే అంటూ రెండు రాష్ట్రాలలో మేకపోతు గాంభీర్యాలు పోతున్న వైసీపీ, బిఆర్ఎస్ లలో తిరిగి ఏ ఒక్క పార్టీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ ఏపీ వినాశనానికి, రాజధాని అమరావతి విధ్వంసానికి ప్రణాళికలు పడ్డట్టే.

కాబట్టి రానున్న నాలుగేళ్ళ కాలం కూటమి ప్రభుత్వానికి అత్యంత కీలకం కానుంది. ఈ నాలుగేళ్లలోనే రాజధాని మార్పు అంటూ వైసీపీ చేసే విచ్ఛిన్న రాజకీయాలకు చెక్ పెడుతూనే, అమరావతి నిర్మాణాలను పూర్తి చెయ్యాలి. అలాగే ఏపీని అటు పారిశ్రామికంగా, ఇటు భౌగోళికంగా అభివృద్ధి చేసుకోవాలి. ఏపీలో వైసీపీ అధికారంలోకి రాకున్నా అటు తెలంగాణలో బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా వైసీపీ అందుకు తగ్గట్టుగా రాజకీయ వాతావరణాన్ని ఏపీలో సృష్టించగలరు.




టీడీపీ ని ఇరుకున పెట్టె రాజకీయాలు చేస్తూ, బాబు పై నిత్యం విషం చిమ్మే వార్తలు ప్రచారం చేస్తూ రెండు రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టించడంలో వైసీపీ, బిఆర్ఎస్ పార్టీలు ఆరితేరిపోయాయి. కాబట్టి ఈ నాలుగేళ్ళ కాలం ఏపీ కి జీవన్మరణ సమస్య అనే చెప్పవచ్చు. మరి తమ చేతిలో ఉన్న ఈ విలువైన నాలుగేళ్ళ కాలం టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోక తప్పదు.