Kalki 2898 AD

“బాహుబలి” మరియు “ఆర్ఆర్ఆర్” చిత్రాలతో ప్రపంచ సినీ జనులను ఒక్కసారిగా టాలీవుడ్ వైపు తిరిగేలా చేసిన రాజమౌళి పుణ్యమా అంటూ, నాటి నుండి దేశవ్యాప్తంగా తెలుగు సినిమాల హవా కొనసాగుతోంది.

ఆ తర్వాత వచ్చిన “పుష్ప”తో పాటు ‘కార్తికేయ, హనుమాన్’ సినిమాలు తెలుగు మార్కెట్ స్థాయిని సద్వినియోగం చేసుకుని, కంటెంట్ కరెక్ట్ గా ఉంటే స్టార్ డంతో పని లేదన్న విషయాన్ని చాటి చెప్పాయి.

Also Read – రాజకీయమా? రాక్షసత్వమా?

ఇప్పటివరకు చప్పగా సాగుతున్న సినీ ప్రపంచంలోకి జూన్ 28వ తేదీన ప్రభాస్ – నాగ్ అశ్విన్ ల “కల్కి” సినిమా ద్వారా ఓ సంచలనమే నమోదు కాబోతుందన్న సంకేతాలు సినీ వర్గాల్లో బలంగా వినపడుతున్నాయి.

జూన్ తో మొదలు కాబోతున్న తెలుగు సినిమాల హవా, ప్రతి నెలా ఓ భారీ బడ్జెట్ సినిమా విడుదలలతో ఈ ఏడాది డిసెంబర్ వరకు నిర్విరామంగా కొనసాగనుంది. దీంతో మరోసారి తెలుగు సినీ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతుందన్న అంచనాలు రెట్టింపయ్యాయి.

Also Read – అప్పుడు వద్దనుకున్న రాజ్యాంగమే అవసరం పడిందిప్పుడు

జూన్ లో “కల్కి”తో ప్రారంభం కానుండగా, జులై లో కమల్ హాసన్ – శంకర్ ల “భారతీయుడు 2” సినిమా సిద్ధమవుతోంది. ఇక ఆగష్టులో సుకుమార్ – అల్లు అర్జున్ ల “పుష్ప 2” మరోసారి సెన్సేషన్ సృష్టించడానికి సన్నద్ధం కానుంది. “పుష్ప 2” ఫలితంతో “పుష్ప 3” కూడా ఉండబోతుందన్న సమాచారం ట్రేడ్ వర్గాల్లో స్పష్టమవుతోంది.

సెప్టెంబర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సుజిత్ కాంబోలో “ఓజీ” దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుందని ఈ సినిమాలో నటించిన నటీనటులు ఇప్పటికే పలు ఇంటర్వ్యూల స్పష్టం చేయడంతో, ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ గా “ఓజీ” మిగలనుంది.

Also Read – బాధ్యతకు…బరితెగింపుకు వ్యత్యాసం..!

ఇక కొరటాల శివ – జూనియర్ ఎన్టీఆర్ ల “దేవర” కూడా అక్టోబర్ లో ఇండియా వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. “ఆర్ఆర్ఆర్” తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు ఏ మాత్రం క్రేజ్ వచ్చిందో చాటి చెప్పడానికి నిదర్శనంగా ఈ “దేవర” నిలవనుంది ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు.

“ఆర్ఆర్ఆర్” మరో హీరో ఆయిన రామ్ చరణ్ “గేమ్ చేంజర్”తో నవంబర్ లో సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేయనున్నాడు. సుప్రసిద్ధ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ తో అయినా దిల్ రాజు సక్సెస్ బాట ఎక్కాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

ఇక ఫైనల్ కిక్ గా డిసెంబర్ లో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” రెడీ అవుతుందన్న టాక్ లేటెస్ట్ గా ఊపందుకోవడంతో, పవన్ ఫ్యాన్స్ కు మరింత ఉత్సాహం వచ్చింది. ఈ సినిమా కూడా దేశవ్యాప్తంగా విడుదలకు సంసిద్ధమవుతోంది.

జులై లో విడుదల కాబోయే “భారతీయుడు 2” మినహాయిస్తే, మిగిలిన అన్నీ సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి తెరకెక్కుతున్నవే. దీంతో బడా బాలీవుడ్ హీరోలు మరియు నిర్మాతల చూపులు కూడా ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుల మీదే ఉన్నాయి.

దానికి నిదర్శనమే ‘హనుమాన్’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ కిషోర్ తో రణవీర్ సింగ్ జోడి కట్టడం. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద జయకేతనం ఎగురవేస్తే రానున్న రోజుల్లో ఇండియన్ చిత్ర పరిశ్రమలో తెలుగు సినీ దర్శకులదే హవా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.