
బాహుబలి తో టాలీవుడ్ స్థాయి పెరిగింది, RRR తో తెలుగు సినిమా ప్రతిష్ట ఆస్కార్ ను తాకింది, పుష్ప తో తెలుగోడి సత్తా ప్రపంచానికి తెలిసింది అని గర్వపడుతున్న క్షణాలలో తెలుగు సినీ పరిశ్రమ సొంత రాష్ట్రాలలో వివాదాలను ఎదుర్కొంటుంది.
ఇలా రచ్చ గెలిచినప్పటికీ ఇంట రాజకీయాలతో టాలీవుడ్ పరువు రచ్చ కెక్కుతుంది. గత ఐదేళ్లు వైసీపీ మూర్కత్వనికి తలవంచిన టాలీవుడ్, పరిశ్రమ పరంగా అనేక కష్టనష్టాలను ఒర్చింది. ఇక ఏపీలో వైసీపీ కథ బెంగుళూర్ కెళ్ళింది లే అనుకుంటే తెలంగాణ లో కథ మొదటికొచ్చింది.
Also Read – ఓటమి ఒప్పుకోవడం, బాధ్యత వహించడం చంద్రబాబుకే చెల్లు!
బిఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయ విమర్శల మధ్య టాలీవుడ్ కి సంబంధించిన సమంత, అక్కినేని కుటుంబం నలిగిపోయింది. ఈ వివాదం పై టాలీవుడ్ మొత్తం ఏకతాటి మీదకొచ్చి అక్కినేని కుటుంబానికి, సమంతకు తమ మద్దతు తెలపడంతో పాటుగా వివాదానికి మూలమైన కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి కొండా సురేఖ మీద విమర్శల దాడి గుప్పించారు.
చివరికి ఈ వివాదం పరువు నష్టం కేసుల వరకు వెళ్లి న్యాయస్థానం గడప తాకింది. ఇక పుష్ప -2 ప్రీమియర్ షో తో సంధ్యా థియేటర్ ఘటన టాలీవుడ్ లో రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. దీనితో అటు తెలంగాణ ప్రభుత్వానికి ఇటు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు మధ్య మాటల మంటలు అంటుకున్నాయి. అసెంబ్లీ వేదికగా స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అల్లు అర్జున్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం,
Also Read – రేవంత్ రెడ్డి…మరో జగన్ రెడ్డి కానున్నారా.?
దానికి బన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంటర్ గా ప్రెస్ మీట్ నిర్వహించడం, ఇక ఆ పై బన్నీ ఇంటి మీద రాళ్ల దాడి జరగడం, ప్రభుత్వ పెద్దలతో టాలీవుడ్ ప్రముఖుల రాయబారాలు ఇలా ఒక తెలుగు సీరియల్ మాదిరి పుష్ప వివాదం టాలీవుడ్ ప్రతిష్టను దిగజార్చింది. ఇక తెలంగాణ ప్రభుత్వం తో ఆ వివాదం సద్దుమణిగిందిలే, పరిస్థితులు చక్కబడ్డాయిలే అని ఆనందించే లోపే ఇప్పుడు ఏపీ రాజకీయాలు విశ్వక్ ‘లైలా’ ను చుట్టుకున్నాయి.
లైలా ఫ్రీ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నటుడు పృథ్వి చేసిన 11 గొర్రెల వ్యాఖ్యలు పరోక్షంగా వైసీపీ ని తాకడంతో ఇక వైసీపీ లైలా సినిమా మీద ప్రత్యక్ష దాడికి దిగింది. సందు దొరికితే చాలు ఇండస్ట్రీ మీద కూడా రాజకీయం చేసేద్దాం, పాగా సాధించేద్దాం అన్నట్టు కాచుకుని కూర్చొనే వైసీపీ కి ఇప్పుడు పృథ్వి చేసిన కామెంట్స్ ఒక జీవామృతంలా కనిపించాయి.
Also Read – మంచి ప్రశ్న వేశారు మద్యలో ఆవు కధ దేనికి భూమనగారు?
దానితో బాయ్ కాట్ లైలా అనే # టాగ్ తో ఈ మూవీ మీద నెగటివ్ ప్రచారం మొదలుపెట్టారు వైసీపీ శ్రేణులు. ఒక్కడి మీద ఉన్న ద్వేషానికి రాష్ట్ర భవిష్యత్ నైనా బలి చేయడానికి సిద్ధంగా ఉండే వైసీపీ పృథ్వి ఒక్కడి కోసం లైలా మూవీ మొత్తాన్ని సర్వ నాశనం చేయడానికి యత్నిస్తుంది. తమ తప్పు లేకపోయినా మీడియా ముందుకొచ్చి క్షమాపణలు అడిగారు హీరో విశ్వక్, నిర్మాత సాహు.
అయినా కూడా వైసీపీ కనికరించేదెలా అన్నట్టుగా ఇప్పటికి ఆ మూవీ మీద రాజకీయం చేస్తూనే ఉన్నారు. అలాగే ఇక పైన పృథ్వి నటించే ఏ సినిమానైనా వైసీపీ బాయ్ కాట్ చేస్తుందంటూ టాలీవుడ్ పై అజమాయిషీ చేసే హెచ్చరికలు పంపింది వైసీపీ. మొన్నటిదాకా కాంగ్రెస్ vs పుష్ప గా సాగిన తెలంగాణ రాజకీయ వివాదం, ఇప్పుడు వైసీపీ vs లైల గా ఏపీ రాజకీయాలలో కొనసాగుతుంది.
ఇక కొన్నేళ్ల నుంచి అజ్ఞాతంలో ఉన్న పైరసి భూతం ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యి టాలీవుడ్ ను మరోసారి భయపెడుతుంది. అల్లు అరవింద్ బ్యానేర్ లో బన్నీ వాసు నిర్మాతగా తాజాగా విడుదలైన చై, తండేల్ మూవీ పైరసి ప్రింట్ ఏపీ ప్రభుత్వ బస్సులలో దర్శనమిచ్చింది.
దీనితో బన్నీ వాసు ఆ బస్సు నెంబర్, దాని తాలూకా మూవీ వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఏపీ ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసారు. ఇలా టాలీవుడ్ చుట్టూ రోజుకో రాజకీయ వివాదం నెలకొంటుంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉంటేనే టాలీవుడ్ మీద ఈ రకమైన పెత్తనం చేస్తుంటే ఇక అదే వైసీపీ అధికారంలోకి వస్తే తెలుగు సినీ పరిశ్రమ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహకు కూడా అందకపోవచ్చు.