సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినపుడు కూడా బహుశా ఇంతలా సంబరాలు చేసుకున్నారో లేదో గానీ ప్రస్తుతం టీఆర్ఎస్ వర్గాల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ విజయాన్ని పురస్కరించుకుని జీహెచ్ఎంసీ అపూర్వ విజయానికి కారణమైన కేటీఆర్ స్పందించారు.
“కులమతాలతో సంబంధం లేకుండా టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలందరికీ సవినయంగా సంతోషంగా శిరస్సు వంచి నిండు మనసుతో ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని” కేటీఆర్ అన్నారు.
ADVERTISEMENT
ఎన్నికల ప్రచారంలో చాలా మంది చాలా మాటలు అన్నారని, అయితే ప్రస్తుతం అవేమీ ప్రస్తావించడం లేదని, ప్రతిపక్షాలు మారాలి, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని” సూచనలు చేసారు. సకల జనులు టీఆర్ఎస్ ను ఆదరించారని, ఇక నుండి టీఆర్ఎస్ అంటే “తిరుగులేని రాజకీయ శక్తి” అని నొక్కి వక్కాణించారు కేటీఆర్.
ADVERTISEMENT



