అధికార మధంతో యావత్ ప్రపంచదేశాలకు సమస్యలు సృష్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇంతకాలం తనకు ఎదురే లేదన్నట్లు వ్యవహరించారు. కానీ ఇంత కాలానికి ఆయనకు సరైనోడు తగిలాడు. ఆయనే ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ!
48 గంటలలో హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేసి నేలమట్టం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
ఆయనకు ఇరాన్ కూడా అంతే ధీటుగా బదులిచ్చింది. “మేము కూడా అమెరికాను ఇదే చివరిసారి హెచ్చరిస్తున్నాము. మా దేశ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోము. మేము కూడా అమెరికాకు సాయపడుతున్న గల్ఫ్ దేశాలపై అంతకంటే భీకర స్థాయిలో దాడులు చేస్తాం. ఆయా దేశాలలో చమురు బావులు, చమురు కంపెనీలు. ఎల్పీజీ, ఎల్ఎన్జీ, ఐటీ, నీటిశుద్ధి కేంద్రాలపై దాడులు చేసి ధ్వంసం చేస్తాము,” అని ఇరాన్ ప్రతి హెచ్చరిక చేసింది.
ఒకవేళ ఇరాన్ విద్యుత్ కేంద్రాలను అమెరికా ధ్వంసం చేసినట్లయితే, దేశంలో విద్యుత్ వ్యవస్థ, దాంతో పాటు ఇరాన్ సైనిక అవసరాలకు వినియోగిస్తున్న రాడార్, కంప్యూటర్ వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయి.
కనుక ఎట్టి పరిస్థితులలో వాటిని ఇరాన్ కాపాడుకొని తీరాలి. కానీ అమెరికా దాడులు చేసేందుకు సిద్దమవుతోంది. కనుక అమెరికాను కట్టడి చేసేందుకు ఇరాన్ ముందుగానే ఇరుగుపొరుగు గల్ఫ్ దేశాలలో అది ప్రకటించిన కీలక ప్రదేశాలపై భీకర దాడులు చేయవచ్చు.
ట్రంప్ బెదిరింపుతో ఇరాన్ భయపడుతుందనుకుంటే, అమెరికాతో చేతులు కలిపిన పాపానికి గల్ఫ్ దేశాలు భయపడే పరిస్థితి నెలకొంది. ముందుగా అవే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కనుక అవే ట్రంప్‌ని అడ్డుకోవాల్సి ఉంటుంది. ట్రంప్‌కి సరైన మొగుడు మోజ్తబా ఖమేనీయే కదా? ఎనీ డౌట్?






