
ట్రంప్ లేదా పుతిన్ వంటివారు దుందుడుకుగా వ్యవహరిస్తే ఆ ప్రభావం యావత్ ప్రపంచదేశాలపై పడుతుందని ఇప్పటికే స్పష్టమైంది. కనుక అంతర్జాతీయ వ్యవహారాల గురించి కూడా ఆలోచించక, మాట్లాడుకోక తప్పడం లేదు.
భారత్‌తో సహ 75 దేశాలు తమపై ప్రతీకార చర్యలకు పాల్పడకుండా సుంకాలు తగ్గించాలని తనని ప్రాధేయపడుతున్నాయని ట్రంప్ గొప్పగా చెప్పుకున్నారు. కనుక వాటిపై పెంచిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నామని ట్రంప్ నిన్న ప్రకటించారు.
Also Read – ముందు టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించండి మహాప్రభో!
తన దుందుడుకుతనం వలన అమెరికాకు కూడా తీవ్రంగా నష్టం జరుగుతోందని ట్రంప్ చాలా త్వరగానే గ్రహించారు. కనుక నాలుగు రోజుల వ్యవధిలోనే వెనక్కు తగ్గడం వలన తన నిర్ణయాలు తప్పని ట్రంప్ స్వయంగా ధృవీకరించిన్నట్లయింది. కానీ ట్రంప్ తన తప్పుని తెలివిగా సమర్ధించుకుంటున్నారు అంతే. ఏది ఏమైనప్పటికీ ట్రంప్ తాజా నిర్ణయం, అమెరికా-చైనాల మద్య మొదలైన వాణిజ్య యుద్ధం వలన భారత్ వంటి దేశాలకు పెద్ద వరంగా మారబోతోంది.
చైనా, పాకిస్తాన్‌లు ప్రత్యక్షంగానే భారత్‌ని దెబ్బ తీసేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ట్రంప్ దెబ్బలకు చైనా కూడా విలవిలలాడుతున్నా పైకి మాత్రం మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తోంది.
Also Read – HIT 3: అడివి శేష్ ఫైట్ సీన్ లీక్‌తో సర్‌ప్రైజ్!
కానీ ట్రంప్‌ని ఎదుర్కోవడానికి భారత్‌తో సహా ఆసియా దేశాలు తమతో కలిసి రావాలని, భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు మరింత బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉందంటూ చైనా సన్నాయి నొక్కులు నొక్కుతోంది.
ఓ పక్క భారత్ భూభాగాలను కబళించడానికి ప్రయత్నిస్తూ, తన ఉత్పత్తులతో భారతీయ పరిశ్రమలను దెబ్బ తీస్తూనే, భారత్ సహాయ సహకారాలు ఆశిస్తుండటం చాలా విచిత్రంగా ఉంది.
Also Read – వైఎస్ షర్మిల: ఏపీ రాజకీయాలలో ఎక్స్‌ట్రా ప్లేయర్?
చైనా, పాకిస్థాన్ నైజమే అంత అని సరిపెట్టుకున్నా భారత్ సాయం పొందిన నేపాల్, బాంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు కూడా వాటితో చేతులు కలిపి భారత్‌కు నష్టం కలిగేవిదంగా వ్యవహరిస్తున్నాయి. భారత్‌ని ద్వేషిస్తున్నాయి. ఇది చాలా బాధాకరమే కానీ నేటికీ భారత్ వాటితో స్నేహమే కోరుకుంటోంది.
అంతర్గత సమస్యలతో నానా బాధలు పడుతున్న బంగ్లాదేశ్, భారత్ స్నేహ హస్తాన్ని అందుకునే ప్రయత్నం చేయకపోగా, ‘భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలపై చైనా పట్టు సాధించాలన్నట్లు’ ఆ దేశ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ చైనా పర్యటనలో మాట్లాడటం దిగ్బ్రాంతి కలిగిస్తుంది.
ఇంతకాలంగా బంగ్లాదేశ్ అనుచితంగా వ్యవహరిస్తున్నప్పటికీ భారత్ చాలా సంయమనం పాటిస్తూనే ఉంది. కానీ యూనస్ వ్యాఖ్యలపై వెంటనే తీవ్రంగా స్పందించింది.
బంగ్లాదేశ్ ఎగుమతులకు భారత్ పోర్టులను వినియోగించుకునేందుకు ఇచ్చిన అనుమతిని తక్షణం రద్దు చేసిన్నట్లు ప్రకటించింది. ట్రంప్ సుంకాల దెబ్బకు విలవిలలాడుతున్న బంగ్లాదేశ్‌కి ఇది చాలా పెద్ద షాక్ అనే చెప్పొచ్చు.