
జగన్ అండ చూసుకుని పెట్రేగిపోయిన వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు, వారిని చూసి పెట్రేగిపోయిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇంకా పలువురు అధికారులు ఇప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్నారు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు పడగా, వైసీపి నేతలపై కేసులు నమోదవుతున్నాయి.
Also Read – ఒక్క ఫోన్‌కాల్‌తో వందకోట్లు అప్పు.. దటీజ్ విజయసాయి రెడ్డి!
తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ని నేడు ఇబ్రహీంపట్నంలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు జోగి రమేష్ సోదరుడు జోగి వెంకటేశ్వరరావు, మరో 8 మందిపై కేసు నమోదు చేశారు.
Also Read – జాక్ అండ్ లైలా: రెండు స్పీడ్ బ్రేకర్లే
అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతుంటారు. కేసులు నమోదైతే పార్టీలు మారుతూ వాటి నుంచి తప్పించుకోగలరు.
కానీ అధికారులకు ఆ అవకాశం ఉండదని తెలిసినా నాయకుల మెప్పు కోసం లేదా వారి బెదిరింపులు, ప్రలోభాలకు లొంగి వారి అవినీతికి సహకరిస్తూ కేసులలో చిక్కుకొని జైలుకి వెళ్ళాల్సి రావడమే ఆలోచింపజేస్తుంది.
Also Read – పోలీస్ గడప దాటించి కోర్టుకి తీసుకువెళ్తే చాలు.. కేసు ఫినిష్!
ఈ కేసులో అడుసుమిల్లి మోహన రంగదాసు, వెంకట సీతామహాలక్ష్మిలతో పాటు విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వర రావు, విజయవాడ రూరల్ తహశీల్దార్ జాహ్నవి, విజయవాడ రూరల్ డెప్యూటీ తహశీల్దార్ విజయ్ దేవరకొండ కుమార్, మండల సర్వేయర్ రమేష్, సర్వేయర్ దేదీప్యల కూడా సీఐడీ పోలీసులు సెక్షన్స్ 471, 120 (బి) కింద కేసు నమోదు చేశారు.
ఆనాడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులలో చాలా మంది చంచల్‌గూడా జైలుకి వెళ్ళగా మరికొందరు ఆ కేసులలో చిక్కుకొని నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. జగన్ 5 ఏళ్ళ అవినీతి పాలన తర్వాత మళ్ళీ సరిగ్గా అదే విదంగా జరుగుతోంది.
అయినా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఎవరు నమ్ముకున్నా చివరికి ఇలాగే జరుగుతుంటుంది. జగన్ మాటలు గుడ్డిగా నమ్మి వైసీపి నేతలందరూ ఎన్నికలలో ఓడిపోయి మునిగిపోయారు. మరో విదంగా చెప్పుకుంటే జగన్ వారందరినీ ముంచేశారనుకోవచ్చు.
జగన్ వలన వైసీపి నేతలు నష్టపోతే వారు తట్టుకోగలరు… మళ్ళీ కోలుకోగలరు. కానీ వారిని చూసుకొని అధికారులు చెలరేగిపోయిన అధికారులు మాత్రం ఇలా కేసులలో చిక్కుకొని కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తుంది. కనుక ఓ ముఖ్యమంత్రి, మంత్రి, ఓ ప్రజాప్రతినిధి సరైనవాడా కాడా?అని పార్టీ నేతలు ఆలోచించకపోతే అది వారిష్టం. కానీ వారి భరోసాతో అవినీతి, అక్రమాలకు కొమ్ముకాస్తే, తర్వాత మన పరిస్థితి ఏమిటని ప్రతీ అధికారి ఆలోచించుకోవలసిన అవసరం ఉందని తాజా కేసు నిరూపిస్తోంది.