స్వర్గీయ జయలలిత సొంత నియోజకవర్గం ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్ భారీ విజయం దిశగా పయనిస్తున్నారు. తొలిరౌండ్ నుంచీ దినకరన్ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ఫలితం ఏకపక్షంగా రాబోతుంది. మూడే నెలలో తమిళ నాడులో గవర్నమెంట్ పడిపోతుంది అని దినకరన్ చెప్పడంతో తమిళ రాజకీయం పెను కుదుపుకు సిద్ధం అవుతుంది.
ఒకరకంగా ఈ తీర్పు బీజేపీకి చెంపపెట్టు లాంటిది. శశికళను జైలుకు పంపి తమిళనాడుపై పట్టు సాధిదం అని చుసిన కమలనాథులకు ఇది పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. అవసరం అయితే ఉపయోగపడుతుంది అని అంటకాగిన డీఎంకే కూడా మూడో స్థానానికే పరిమితం కావడంతో బీజేపీ పాచిక పారలేదు అనే చెప్పుకోవాలి.
మరోవైపు స్వయంగా పోటీ చేసినా ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణంగా చతికిలపడినట్టు కనిపిస్తోంది. కనీసం నోటా మీటకు దక్కిన ఓట్లు కూడా సదరు జాతీయ పార్టీకి దక్కకపోవడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ఒకరకంగా తమ రాష్ట్రంలో బీజేపీ జోక్యాన్ని ఈ విధంగా అక్కడి ప్రజలు తిరస్కరించారు అనే చెప్పుకోవాలి.
ఇక్కడ నుండి జైలు నుండే శశికళ చక్రం తిప్పబోతున్నారు. ఇప్పటిదాకా పళనిస్వామి – పనీర్ సెల్వం కూడా ఉన్న ఎమ్మెల్యేలు మళ్ళి దినకరన్ పక్కన చేరి గవర్నమెంట్ ను కూలదోసే ప్రయత్నం చెయ్యవచ్చు. దీనితో అతితొందరలోనే తమిళ నదుకు ఎన్నికలు వచ్చే పరిస్థితి కనబడుతుంది.





