కేసీఆర్ గారూ… మీరు ప్రమాణస్వీకారం చేసేస్తే అయిపోయినట్టు కాదు

tummala-nageswara-rao-to-vacate-mla-quartersఇటీవల జరిగిన ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల ఓడిపోయిన సం గతి విదితమే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ లోని మంత్రుల నివాసాల్లో ఉన్న తన క్వార్టర్‌ను ఖాళీ చేయాలని తుమ్మల భావించారు. అయితే విషయం తెలుసుకున్న తెరాస పెద్దలు విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పారట. “మీకు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్‌ను ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇప్పుడే తొందరపడి ఖాళీ చేయ కండి’ అంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు ఫోన్‌ కాల్‌ వచ్చింది.

[m9ad]

ADVERTISEMENT

దీనితో తుమ్మలకు ఎమ్మెల్సీ రూట్ లో మంత్రి పదవి ఇవ్వనున్నారా అనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో సామాజికవర్గ పరంగా అత్యంత కీలకంగా ఉన్న తుమ్మలకు సముచిత స్థానం కల్పించటం ద్వారా విజయావకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలని వారు భావించారు. దీనితో ఓడిపోయినా ఆయనకు ప్రాధాన్యత తగ్గకుండా చూడాలని కేసీఆర్ భావిస్తున్నారా? అని అంతటా చర్చిస్తున్నారు. మరోవైపు మంత్రి పదవి లేకపోయినా క్వార్టర్స్ ఖాళీ చెయ్యొద్దని చెప్పారా అని ఇంకో ఆలోచన.

ఖమ్మం జిల్లా నుంచి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కూడా మంత్రి పదవి దక్కబోతుందని సమాచారం. స్వల్ప స్థాయిలోనే జరిగే క్యాబినెట్ విస్తరణలో ఒకే జిల్లాకు చెందిన ఇద్దరికి మంత్రి పదవి వస్తుందా అనేది చూడాలి. మరోవైపు కేసీఆర్ ఏమి ఆలోచిస్తున్నారు అనేది ఎవరికీ పాలు పోవడం లేదు. ఇటువంటి లెక్కలు, ఊహాగానాలు ఎన్నో.. కేసీఆర్ మాత్రం క్యాబినెట్ విస్తరణ చెయ్యకుండా దేశవ్యాప్తంగా ఫెడరల్ ఫ్రంట్ అంటూ టూర్లు చేస్తున్నారు. ఈ నెల 28 తరువాత కేసీఆర్ రాష్ట్రానికి తిరిగి వస్తారు.

ఒకవేళ జనవరి నాలుగో తేదీలోగా కేబినెట్ ను ఏర్పాటు చేయకపోతే.. ఆ తర్వాత ముహూర్తాలే లేవని అంటున్నారు. ఫిబ్రవరి వరకూ కొత్త కేబినెట్ కొలువుదీరే అవకాశాలు లేవని చెబుతున్నారు. అదే జరిగితే పాలన మొత్తం కుదేల్ అవుతుంది. కేసీఆర్ మాత్రం తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేసి కుమారుడు కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసేసి పని అయిపోయిందన్నట్టుగా ఉన్నారు. దీనిపై లోలోపల ఏమి ఉన్నా తెరాస ఎమ్మెల్యేలు మాత్రం ఆయనను ఏమీ అనలేని పరిస్థితి

ADVERTISEMENT
Latest Stories