ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ అభినవ మృతి!

tv-anchor-actress-mallika-passes- awayటీవీ యాంకర్ అభినవ అకాల మరణం చెందారు. అభినవ అంటే ఎవరో కాదులెండి… తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మల్లిక పేరుతో పరిచయం అయిన యాంకర్ అసలు పేరు అభినవ. తొలుత టీవీ యాంకర్ గా ప్రవేశించిన మల్లిక, తదుపరి కొన్ని సినిమాలలో కూడా నటించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ, సోమవారం ఉదయం 10.30 నిముషాలకు తుది శ్వాస విడిచారు.

దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అంత్యక్రియలు మంగళవారం నాడు స్వస్థలమైన హైదరాబాద్ లో జరగనున్నాయి. గత 20 రోజులుగా కోమాలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. కేవలం 39 ఏళ్ళ ప్రాయంలోనే నూరేళ్ళు నిండిపోవడం బుల్లితెర సినీ లోకాన్ని కలిచివేసింది. అసభ్యతకు తావు లేకుండా 90, 2000 దశకాల్లో మంచి యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న మల్లిక పలు అవార్డులను సైతం తన సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మృతి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ…. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం..!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories