కన్నడ ఉపేంద్ర కొత్త రాజకీయ పార్టీ ప్రకటన!

Upendra party Launches Karnataka Pragnavantha Janatha Pakshవిలక్షణమైన సినిమాలతో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. గతకొంత కాలంగా ఉపేంద్ర రాజకీయాల్లోకి వస్తా అని చెబుతూ వస్తున్నారు. మొత్తానికి ఈ రోజు తన కొత్త పార్టీని అనౌన్స్ చేశారు. వచ్చే సంవత్సరం జరగనున్న కర్నాటక ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చెయ్యనుంది.

ADVERTISEMENT

కర్నాటక ప్రజ్ఞవంత జనతా పక్ష (కేపీజెపీ) ఆ పార్టీ పేరు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కర్నాటకలో పవర్లో ఉంది. ఆ పార్టీ మీద ఉన్న ప్రజావ్యతిరేకతను ఆసరాగా చేస్కుని ఎన్నికల్లో గెలవాలని భాజపా చూస్తుంది. ఈ క్రమంలో ఉపేంద్ర కొత్త పార్టీ ఎవరికి నష్టం చేస్తుందని విశ్లేషణలు జరుగుతున్నాయి.

దక్షిణాదిన సినీ తారలు రాజకీయ పార్టీలు పెట్టడం కొత్తేమీ కాదు. గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలపై తమదైన ముద్ర వేశారు. అలాగే చిరంజీవి లాగా, విజయకాంత్ లాగా రాజకీయాల్లో విఫలం అయిన వాళ్ళు ఉన్నారు. మరి ఉపేంద్ర ఏం చేస్తారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories