పవన్ పై “తీన్మార్” పంచ్ లు!

v6 tv channel teenmaar satire on pawan kalyan‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందే… పవన్ ను ఇరుకున పెట్టడానికి ఎలాంటి అస్త్రాలను సిద్ధం చేయాలనే దానిపై ప్రత్యర్ధి రాజకీయ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. అలాగే అవకాశం చిక్కినప్పుడల్లా పవన్ పై పంచ్ లు వేయడానికి మీడియా వర్గాలు ముందుంటున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ‘ట్విట్టర్’ ఖాతా హ్యాకింగ్ గురైన విషయం తెలిసిందే. దీనిని బేస్ చేసుకుని ప్రముఖ మీడియా ఛానల్ తన “తీన్మార్” కార్యక్రమంలో పవన్ పై అదిరిపోయే పంచ్ లను పేల్చింది.

ADVERTISEMENT

అసలే ఆర్ధిక కష్టాలలో ఉన్న పవన్ పార్టీని నడుపుకునేందుకే డబ్బులు లేవు, కారు కూడా అమ్ముకునే, వాడెవడో హ్యాక్ చేసి పైసలు ఇమ్మంటే ఇచ్చేస్తామా, ఎందుకియ్యాలే… అంటూ బిత్తిరి సత్తి అమాయకంగా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా సదరు కార్యక్రమం నిర్వహించే యాంకర్ సావిత్రి ‘పాంచ్ పాటాకా’ను పేల్చింది. ‘పవన్ కళ్యాణ్ సార్ పార్టీని నడిపేదే ట్విట్టర్ లోకెళ్ళి, అది లేకుంటే సార్ ఏం రాయలేరు కదా…’ అంటూ సావిత్రి వేసిన పంచ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంటే ‘ట్విట్టర్’ లేకుండా ‘జనసేన’ లేదు అన్న భావాన్ని సదరు కార్యక్రమం ద్వారా వీక్షకులకు వ్యక్తపరిచారన్న మాట. కాస్త సెటైరికల్ గా ఉన్నప్పటికీ, ప్రస్తుతం సినిమాలపై దృష్టి కేంద్రీకరించిన పవన్ కళ్యాణ్… జనసేన భావాలను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఎక్కువ శాతం పార్టీని అలాగే నడుపుతున్నారు. పవన్ పై పంచ్ పడిందని అభిమానులు ఫీలౌతున్నప్పటికీ, అందులో వాస్తవం అయితే లేకపోలేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి పంచ్ లన్నీ సర్వ సాధారణమే కదా… మున్ముందు ఇంకెన్ని చవిచూడాలో ఏమో..!

ADVERTISEMENT
Latest Stories