టీడీపీ తప్ప వంగవీటి రాధాకు వేరే ఆప్షన్ లేదా?

Vangaveeti Radha joining TDPదివంగత వంగవీటి రంగ తనయుడు వంగవీటి రాధ వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఈ నిర్ణయానికి బీజం గత ఏడాదే పడింది. పార్టీ అధిష్ఠానం సెంట్రల్‌ టికెట్‌ రాధాకు ఇవ్వడం లేదన్న విషయాన్ని సెప్టెంబరులో స్పష్టం చేసింది. దీంతో రాధా అభిమానులు భగ్గుమన్నారు. వారి ఆగ్రహం చల్లారకముందే సెంట్రల్‌ నియోజకవర్గ సమన్వకర్తగా మల్లాది విష్ణును నియమిస్తూ వైసీపీ అధిష్ఠానం ప్రకటన జారీ చేసింది. గతంలో రాధా ఓడిపోయినా విజయవాడ తూర్పు గానీ మచిలీపట్టణం పార్లమెంట్ కు గానీ పోటీ చెయ్యమని అడిగినా రాధా ఒప్పుకోలేదు.

సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి మినహా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసేది లేదని అధిష్ఠానానికి తెగేసి చెప్పారు. నెలలు గడుస్తున్నా పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన హామీ లేకపోవడంతో విసిగివేసారిన ఆయన ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఆయన అభిమానులలో జనసేనలో చేరాలన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. అయితే రాధా సన్నిహితులు మాత్రం ఆయన టీడీపీలో చేరితో భవిష్యత్తు బాగుంటుందని సూచిస్తున్నట్టు సమాచారం. అయితే రాధా ను జనసేనలోకి తీసుకుంటే కుల ముద్ర పడుతుందా అనే అనుమానం పవన్ కళ్యాణ్ లో ఉందట.

ADVERTISEMENT

పైగా ఆయన అడిగే విజయవాడ సెంట్రల్ సీటు కోసం కమ్యూనిస్టులు పట్టుపడుతున్నారు. దీనితో ఆయనను పార్టీలోకి తీసుకోవడంపై పవన్ కళ్యాణ్ లో సానుకూలత లేదని సమాచారం. టీడీపీ ఆయనను తీసుకోవడానికి సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. అయితే ఆయన కోరినవిధంగా కాకుండా ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. రాధాకి సముచిత గౌరవం ఇచ్చినట్టు ఉండాలంటే మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలోనే ఆయనకు ఒక సీటు కేటాయించాలని అనుకుంటున్నారు.

అయితే టీడీపీలో చేరడం అంటే రాధాకు సామజిక వర్గ పరంగా ఇబ్బంది ఉంటుంది. పైగా దేవినేని వర్గం కూడా టీడీపీలోనే ఉంది. కాపు ఓటర్లను ఆకట్టుకోవడానికి గానూ ఆయనకు టీడీపీ స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు అభిమానులు, అనుచరులతో మాట్లాడి రెండు రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని రాధా ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ తప్ప రాధాకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఈ క్రమంలో ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో అని రంగా అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories